బన్నీ మూవీలో గిలిగింతలు పెట్టేలా సునీల్ పాత్రను మలుస్తున్న త్రివిక్రమ్!

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటుడు సునీల్ ఒకప్పుడు ఒకే రూములో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఇద్దరి మధ్య లాంగ్ ఫ్రెండ్షిప్, క్లోజ్ రిలేషన్ ఉంది. త్రివిక్రమ్ తనకు రచయితగా అవకాశం వచ్చిన తర్వాత సునీల్ కోసం ఎన్నో మంచి పాత్రలు రాసి అతడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ అయ్యేందుకు తనవంతు సహాయం చేశాడు.

అయితే సునీల్ హీరోగా తన ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత త్రివిక్రమ్ అతడికి కామెడీ పాత్రలు రాయడం మానేశాడు. అయితే హీరోగా నిలదొక్కుకోవడంలో విఫలమైన సునీల్ తిరిగి మళ్లీ కామెడీ పాత్రలు చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన 'అరవింద సమేత' చిత్రంలో తన స్నేహితుడి కోసం మంచి పాత్ర రాసినప్పటికీ అది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాక పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

Trivikram penned comic role for Sunil in AA19

తాజాగా బన్నీతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ మరోసారి సునీల్‌ కోసం మంచి పాత్ర రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సునీల్ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా రాశాడట. సినిమాలో సునీల్ పాత్ర బాగా హైలెట్ అయ్యే విధంగా ఉంటుందట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బన్నీ కెరీర్లో 19వ మూవీ. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ అవ్వగా... జూన్ 5 నుంచి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేతా పేతురాజ్, టబు, బోమన్ ఇరానీ, జయరాం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X