అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా ఆలస్యానికి కారణం అదేనా?

Recommended Video

Reason For Trivikram-Allu Arjun Movie Delay | Filmibeat Telugu

అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న విధంగా ఫలితం ఇవ్వక పోవడంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్నారు. చాలా మంది దర్శకులు కథలు విన్న తర్వాత త్రివిక్రమ్ చెప్పిన కథతో బన్నీ సంతృప్తి చెందారు. 2019 న్యూ ఇయర్ సందర్భంగా తమ కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ ప్రకటన వచ్చి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇంకా సినిమా ప్రారంభం కాకపోవడంతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది. దీనికి తోడు సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు బన్నీ నుంచి మరో ప్రకటన రావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.

బన్నీ అసంతృప్తే ఆలస్యానికి కారణమా?

బన్నీ అసంతృప్తే ఆలస్యానికి కారణమా?

త్రివిక్రమ్ రాసుకున్న కథ విషయంలో అల్లు అర్జున్‌కు కొన్ని అభ్యంతరాలు ఉండటమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ క్లైమాక్స్ విషయంలో బన్నీ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మార్పులు చేసే పనిలో త్రివిక్రమ్ బిజీ

మార్పులు చేసే పనిలో త్రివిక్రమ్ బిజీ

బన్నీ చెప్పిన అభ్యంతరం త్రివిక్రమ్ కూడా రియలైజ్ అయ్యారని, మార్పులు చేస్తేనే బావుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఇందుకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నట్లు సమాచారం.

సినిమా మొదలయ్యేది ఎప్పుడు

సినిమా మొదలయ్యేది ఎప్పుడు

బన్నీ సంతృప్తి చెందే విధంగా త్రివిక్రమ్ క్లైమాక్స్‌లో మార్పులు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మార్చిలోగా పూర్తయితే... ఏప్రిల్ రెండో వారంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ తర్వాతే సినిమా లాంచ్ చేస్తారని టాక్.

ప్రీ ప్రొడక్షన్ వేగం

ప్రీ ప్రొడక్షన్ వేగం

ఈ చిత్రాన్ని హారిక హాసిన ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ భారీగా నిర్మించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే చిత్ర బృందం నుంచి ప్రకటన రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X