త్రివిక్రమ్ చెప్పిన కిటుకుతో రెచ్చిపోతానంటున్న నితిన్
హైదరాబాద్ : గతకొన్నేళ్లుగా సరైన హిట్ లేక వరుస ప్లాపులతో అల్లాడిన యువహీరో నితిన్...ఈ మధ్య ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంతో వరుస హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం విడుదలైనప్పటి నుంచి నితిన్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
పలువురు చిత్ర నిర్మాతల, దర్శకులు, హీరోలు ఈ చిత్రం చూసి సినిమా చాలా బాగుంది అంటూ నితిన్‌కు ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. అందరిలోకెల్లా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి వచ్చిన ప్రశంసలను మాత్రం బెస్ట్ కంప్లిమెంట్‌గా పీలవుతున్నాడు నితిన్.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ....'గుండెజారి గల్లంతయ్యిందే విడుదలైన కొన్ని రోజులకు దర్శకుడు త్రివిక్రమ్ నుంచి కాల్ వచ్చింది. సినిమా బాగుంది, బాగా చేసావని ప్రశంసించారు. ఆయన చెప్పిన విషయాల వల్ల నాకు అర్థమైంది నా యొక్క బలం ఏమిటో...' అని వ్యాఖ్యానించారు.
'త్రివిక్రమ్ నాతో ఏంచెప్పాడంటే....ఇష్క్ సినిమాలో షో అంతా నిత్యామీనన్ మీదనే నడిచింది. ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో అలా జరుగలేదు. సినిమా మొత్తాన్ని నా భుజాల మీదనే మోసానని అర్థమైంది. ఆయన కాంప్లిమెంట్ ఎప్పటికీ మరిచిపోను. నా ఏజ్‌కు సరిపోయే కథలను ఎంచుకుని, ప్రేక్షకులకు మెచ్చే చిత్రాలు చేయడానికి ప్రత్నిస్తాను' అని చెప్పుకొచ్చారు నితిన్.
ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన యామి గౌతమి హీరోయిన్‌గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











