అవునా! సమంతతో త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్ మూవీ?
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా అసలు వార్తల్లో కనిపించడమే లేదు. అయితే తాజాగా ఈ ఇద్దరి విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. త్వరలోఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని, సమంత ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే త్రివిక్రమ్, సమంత కాంబినేషన్లో వరుసగా రెండు సినిమాలు ‘అత్తారింటికి దారేది', ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. ఇపుడు సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే వీరిది హాట్రిక్ కాంబినేషన్ అవుతుందని అంటున్నారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు.

వాస్తవానికి ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేసుకున్నాడట త్రివిక్రమ్. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ సినిమాతో బిజీగా ఉండటం, ఆ సినిమా పూర్తి కావడానికి ఇంకా సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ గ్యాపులో సమంతతో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. సినిమాను ఎవరు నిర్మిస్తారనే విషయం కూడా ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











