తాతగారికి మ్యాచ్ అయ్యే సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్: త్రివిక్రమ్

'అరవింద సమేత వీర రాఘవ రెడ్డి' సినిమాకు మొద‌లు, మ‌ధ్యం, చివ‌ర అంతా ఎన్టీఆరే. ఇంత బ‌ల‌మైన న‌టుడ్ని.. చాలా అరుదుగా చూస్తాం. న‌ట‌న‌కు సంబంధించిన ఎన్టీఆర్ టార్చ్‌బేర‌ర్‌లాంటి వ్య‌క్తి. ఎలాంటి క‌ష్ట‌మైన స‌న్నివేశాన్నిఅయినా ఆ క్ష‌ణంలోనే ఉంటూ న‌టించ‌డం ఆయ‌న‌కున్న గొప్ప ల‌క్ష‌ణం. తాత‌గారి పేరు నిల‌బెట్ట‌డానికి కాదు.. ఆయ‌నకు మ్యాచ్ చేసే స‌త్తా ఉన్న న‌టుడు... అంటూ త్రివిక్రమ్ ప్రశంసలతో ముంచెత్తారు.

అరవింద సమేత విజయవంతమైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు కేవలం 4 రోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trivikram speech about NTR acting skills

స‌మ‌యపాల‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిజాయ‌తీగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు ఆయన సొంతం అంటూ పొగడ్తలు గుప్పించిన త్రివిక్రమ్..... హెవీ ఎమోష‌న్స్ ఉన్న ఈ సినిమా అంత త‌క్కువ స‌మ‌యంలో చేయ‌డానికి కార‌ణం కారణం ఆయనే అని వ్యాఖ్యానించారు.

అతి పెద్ద విషాదం నుండి ..తండ్రి మ‌ర‌ణించ‌డం అనే విషాదాన్ని మ‌న‌సులో దాచుకుని.. మాపై ఎవ‌రిపై ప్ర‌భావం ప‌డ‌కుండా త‌న‌లో తాను న‌లిగిపోయి న‌టించాడు. ఈ స‌క్సెస్ క్రెడిట్ అంతా ఎన్టీఆర్‌గారిదే... అని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X