అతి పెద్ద విషాదం నుండి తొందరగా కోలుకున్నాడు: ఎన్టీఆర్ గురించి త్రివిక్రమ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' మూవీ ఆడియో వేడుక హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ... కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే మాట్లాడకుండా ఉండటం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజు నాకు అలాంటి సందర్భం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను.
ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సమయంలో జరిగిన అతి పెద్ద విషాదం నుండి అతి తొందరగా కోలుకుని, జీవితంలో కూడా నిజమైన హీరోగా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్‌కు మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడు వీర రాఘవ పాత్రలో కనిపించబోతున్నారు. అరవింద పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. ప్రేమ కథ చుట్టూ జరిగే ఫ్యాక్షన్ సినిమాలా ఇది ఉంటుందని తెలుస్తోంది.
'అరవింద్ సమేత' చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











