twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక ప్లాపు, ఒక విషాదం తర్వాత..... ఎన్టీఆర్ వల్లే రూ. 100 కోట్లు : త్రివిక్రమ్ అదిరిపోయే స్పీచ్

    |

    Recommended Video

    Trivikram Speech @Aravindha Sametha Success Press Meet

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' ఫస్ట్ వీకెండ్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో పాటు చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ... ప్రతి సినిమా ఒక ఆలోచనతోనే మొదలు పెడతాం. ఈ కథకు మొదట్టమొదటి ప్రేక్షకులు హీరోనే అవుతాడు. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటించడానికి సారథి ఎన్టీఆర్ మాత్రమే అని త్రివిక్రమ్ అన్నారు.

    ఎన్టీఆర్ ఇంక్రెడిబుల్ యాక్టర్.. ఫిదా అయిన అఖిల్.. స్టార్స్ ఏమన్నారంటే!ఎన్టీఆర్ ఇంక్రెడిబుల్ యాక్టర్.. ఫిదా అయిన అఖిల్.. స్టార్స్ ఏమన్నారంటే!

    అవేమీ ఎన్టీఆర్ కావాలని అడగలేదు

    అవేమీ ఎన్టీఆర్ కావాలని అడగలేదు

    మొట్టమొదట ఈ కథ చెప్పినపుడు ఇందులో ఎంటర్టెన్మెంట్ ఏది? ఆరు పాటలేవి? నాలుగు ఫైట్లు ఏవి? ఇలాంటివేమీ అడగకుండా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో అసలు ఫైట్సే లేవు... ఇందులో ఉన్నవి కేవలం ఎమోషనల్ సీన్స్ మాత్రమే... అని త్రివిక్రమ్ అన్నారు.

     ఎన్టీఆర్ ధైర్యానికి ధాంక్స్

    ఎన్టీఆర్ ధైర్యానికి ధాంక్స్

    ఇలాంటి ఫైట్స్ లేని, పాటల్లేని సినిమాను ఒప్పుకోవడానికి ధైర్యం చేసిన నటుడు ఎన్టీఆర్. ఆయన ధైర్యానికి ముందు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఆయన ఒప్పుకోకుంటే ఈ రోజు ఈ సినిమా లేదు, ఈ విజయం ఉండేది కాదేమో అని త్రివిక్రమ్ అన్నారు.

    ఒక ప్లాపు, ఒక విషాదం తర్వాత

    ఒక ప్లాపు, ఒక విషాదం తర్వాత

    ఇది మా అందరికీ ఎందుకు ఎమోషనల్ జర్నీ అంటే ఒక పరాజయం తర్వాత నేను మొదలు పెట్టిన సినిమా ఇది. ఒక విషాదం తర్వాత విడుదలైన సినిమా. వీటన్నింటికీ దాటుకుని ఒక వెళ్లువలాగా ఇంత సక్సెస్ మాకు ఇచ్చి పండగను నిజంగా మా ఇళ్లలోకి కూడా తీసుకొచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను... అని త్రివిక్రమ్ అన్నారు.

    వాళ్లు ఫైట్ మాస్టర్లు కాదు

    వాళ్లు ఫైట్ మాస్టర్లు కాదు

    రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ తీయలేదు. వారు ఫైట్ మాస్టర్ లెవల్ దాటిపోయారు. వారు కథలో కూర్చోవాలి, వారికి కథ తెలియాలి. వారు సినిమాలో ఒక భాగం డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. అందుకే నేను వారిని స్టంట్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్స్ అని పిలవను. వారిని యాక్షన్ డైరెక్టర్స్ అని పిలుస్తాను. ఇది నేను ఖలేజాలో కలసి పని చేసినపుడే గమనించాను. అరవింద సమేతలో క్లైమాక్స్ ఫైట్ వద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తులు కూడా వీళ్లే అని త్రివిక్రమ్ అన్నారు.

     అందరూ తమ సంతకం చేశారు

    అందరూ తమ సంతకం చేశారు

    ఎలాంటి పరిస్థితుల్లో అయినా మాతో నిలబడి చేసిన జగపతి బాబుగారితో పాటు.... నవీన్ చంద్ర, శత్రు, పవన్, బ్రహ్మాజీ, నర్రా, సంతోష్, ఈశ్వరి రావు, సితార, దేవయాని, సుప్రియ పాఠక్ చిన్న పాత్రలే అయినా ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్రలు చేశారు. ప్రతి ఒక్కరూ తమదైన సంతకం ఈ సినిమాపై చేసి వెళ్లారు. వారికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పాలి.

    పాలిచ్చిపెంచిన తల్లులు వీరు... పాలించడం ఒక లెక్కా

    మేము మొదలు పెట్టినపుడు యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది అనేది చూపించాలనుకున్నాం. అలా ముందుకు వెళుతున్నపుడు దీనికి సొల్యూషన్ ఏముంటుంది? అనుకున్నపుడు మాకు ఫైనల్‌గా తగిలింది ఏమంటే... తల్లికంటే గొప్పగా మనల్ని ఎవరు ప్రేమించగలరు? భార్య కంటే మన విజయాన్ని ఎవరు గొప్పగా కోరుకోగలరు? ఒక సోదరి కంటే మనల్ని ఎవరు ఎక్కువ కాపాడగలరు? వీళ్ల చేతుల్లో మనం అధికారం పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తాం? ఉమెన్ రిజర్వేషన్ గురించి మనం చాలా రోజులుగా మాట్లాడుతున్నాం కానీ దాన్ని మగాళ్లే ఆపుతున్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. మా ఆలోచనలో నుంచి వచ్చిన మాటే ‘పాలిచ్చిపెంచిన తల్లులు వీరు... పాలించడం ఒక లెక్కా'. మాట్లాడటం రానీ, నడవటం రాని మనకు, ఒక ముద్ద తింటే కక్కేసుకునే మనకు ఎక్కడ ఏం చేయాలో తెలియని మనకు సంస్కారం నేర్పారు. అది చేసిన వారికి ఈ వయసు వచ్చిన మనల్ని పాలించడం ఒక లెక్కకాదు.... అని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.

    English summary
    Trivikram speech at Aravindha Sametha Success meet. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde and Eesha Rebba in the lead roles Sunil, Naga Babu, Jagapathi Babu and Supriya Pathak in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X