నేను పాడైపోకుండా చేసింది చిరంజీవిగారే, చొక్కాలు చిరిగిపోయాయి: త్రివిక్రమ్ అల్టిమేట్ స్పీచ్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య విధేయ రామ‌. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.

త్రివిక్రమ్ మాట్లాడుతూ... బోయపాటిగారి టైటిల్ బాగా నచ్చింది. రాముడు మర్యాద పురుషోత్తముడు. తల్లి దగ్గర ఎంత వినయంగా ఉంటాడో, తండ్రి దగ్గర ఎంత విధేయతతో ఉంటాడో... శత్రువు దగ్గర అంత భయంకరంగా ఉంటాడు. అది టైటిల్‌లో కనిపించడం లేదు కానీ టీజర్లో కనిపించిందన్నారు.

ఆ కెపాసిటీ బోయపాటికే ఉంది

ఆ కెపాసిటీ బోయపాటికే ఉంది

బోయపాటి గారి సినిమాలో నాకు నచ్చేది ఆయన తీసే కమర్షియల్ సినిమా ఉదాత్తత లేకుండా ఉంటుంది. బుక్‌లో ఉండే వ్యాల్యూస్ పాటించే వారు చాలా బోరింగ్ గా ఉంటారు అంటారు. కానీ వారిని ఎగ్జైటింగ్ గా చూపించే కెపాసిటీ ఉన్నవారు బోయపాటిగారు. కుటుంబం, అందరితో కలిసి భోం చేయడం బోరింగ్, వెజిటేరియన్ బోరింగ్, పార్టీ లేకుండా ఉంటే బోరింగ్, నిజం మాట్లాడటమే బోరింగ్.. రాముడంటే బోరింగ్... కానీ అది నిజం కాదు. రాముడు అంటే బోరింగ్ కాదు కాబట్టే ఇన్ని శతాబ్దాలు, యగాలు గడిచినా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం. అలాంటి హీరో మీ హీరో ఈ సినిమాలో. మీకు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సినిమా గురించి నాకు తెలియదు అంతకంటే నేను మాట్లాడను. ట్రైలర్ చసిన తర్వాత మీరే మాట్లాడతారని... త్రివిక్రమ్ తెలిపారు.

స్వర్గం లాంటి కోటను నిర్మించింది చిరంజీవిగారే

స్వర్గం లాంటి కోటను నిర్మించింది చిరంజీవిగారే

రెండో విషయానికొస్తే... ఒక కోట, ఆ కోట లోపల ఉండే ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది. ఆ కోటకు వెళ్లే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా ఉంటుంది. ఇలాంటి దారి వేసి, దారి చివరన ఒక కోట కట్టి, కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది నా మాటలు కాదు. మహా కవి శ్రీశ్రీ చెప్పింది. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం... అదే చిరంజీవిగారు. ఎలాంటి రూటు వేశారంటే ఆయన కుటుంబం మన తెలుగువారందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మనందరికీ ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ల అబ్బాయి మనింట్లో పిల్లాడయిపోయాడు. ఆ కోట మనందరికీ ఆనందాన్ని ఇచ్చే ఒకదుర్గం.

చిరంజీవిగారిని అలా అనొచ్చేమో?

చిరంజీవిగారిని అలా అనొచ్చేమో?

మనం కొంత మంది గురించి మాట్లాడటానికి ఎక్కువ వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారి చరిత్ర మనం ఎన్ని రకాలుగా విన్నా బోర్ కొట్టదు. రామాయణాన్ని 300 వెర్షన్లు రాశారు అయినా బోర్ కొట్టదు, గాంధీ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఎలాంటి కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవిగారి గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌతిండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? నాకు సంబంధించిన వరకు మల్టీప్లెక్సులు ఇపుడు వచ్చేశాయి కాబట్టి ఆయన్నుచిట్ట చివరి మ్యాటనీ ఐడల్ అనొచ్చా?

చొక్కాలు చిరిగి పోయిన రోజులు గుర్తున్నాయి

చొక్కాలు చిరిగి పోయిన రోజులు గుర్తున్నాయి

ఆయన మనందరికీ మెగాస్టార్. నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి, చెమటతో చొక్కాలు చిరిగి పోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్లిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మరిచిపోయేలా మనల్ని ఆనంద పరిచే చిరంజీవిగారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎంత చెప్పినా, ఎంత చేసినా ఆయన మనకు అందించిన సంతోషానికి, మనకు అందించిన నవ్వులకు మనతో వేయించిన స్టెప్పులకు, థియేటర్లో మనం అరిచిన అరుపులకు తిరిగి ఏమి ఇవ్వగలం.

నేను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు

నేను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు

సినిమా ఎందుకు గొప్పది అంటే మందు కొట్టి పడుకోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివరకూర్చుని అమ్మాయిలను ఏడిపించడం కంటే థియేటర్లో కూర్చుని ఒక హీరోను చూసి ఇన్ స్పైర్ అవ్వడం మంచిది. కచ్చితంగా మంచిది. అలాంటి మంచి అలవాటును నా కాలేజీ రోజుల్లో నాకు అందించి నేను పాడైపోకుండా చేసిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. నా లాగా ఎంతో మందిని ఒక దారిలో నిలబెట్టారు.

ఒక కానిస్టేబుల్ కొడుకు వచ్చాడు... రైతు కొడుకునైన నేనూ నిర్ణయం తీసుకున్నా

ఒక కానిస్టేబుల్ కొడుకు వచ్చాడు... రైతు కొడుకునైన నేనూ నిర్ణయం తీసుకున్నా

ఒక మేగజైన్లో ఆయన కటింగ్ చూశాను. సౌతిండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో అని ఆయనపై పడిన ఒక ఆర్టికల్ చదివి, నీతిగా, నిజాయితీగా, మిడిల్ క్లాస్ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు అయుండి, ఇంత ఉన్నత స్థాయికి రాగలిగాడు అన్నపుడు, ఒక రైతు కొడుకునైన నేను కూడా రావొచ్చు అని సినిమాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకున్నాను. అలాంటి ఒక పాజిటివ్ దృక్పథం కల్పించిన మెగాస్టార్ నమస్కారం.

తప్పుడు వరుస కాదు... పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి రామ్ చరణ్

తప్పుడు వరుస కాదు... పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి రామ్ చరణ్

మెగాస్టార్ గారి తమ్ముడు, మనకందరికీ ఆత్మీయుడు, ఆయన మాట్లల్లోనే చెప్పాలంటే అంతా కలిపితే నేను పిడికెడు మట్టే కావొచ్చు. కానీ ఒక్కసారి నేను తలెత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉందని అంటాడు. నిజంగానే ఆయనలో అది ఉంది...సో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి కొడుకైన రామ్ చరణ్ గారికి, నేనేమీ తప్ప వరుస చెప్పడం లేదు. అలా అని కళ్యాణ్ గారే చెప్పారు. నా అన్న కొడుకు కాడు..చరన్ నా కొడుకు లాంటోడు అన్నారు. వాళ్ల అబ్బాయి రామ్ చరణ్ కు ఈ సినిమా మరింత విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

నా లాంటి వారి ఆలోచనలో మార్పు తెచ్చిన సినిమా రంగస్థలం

నా లాంటి వారి ఆలోచనలో మార్పు తెచ్చిన సినిమా రంగస్థలం

రంగస్థలం చూసిన తర్వాత ఆయనతో, సుకుమార్ గారితో మాట్లాడాను. నాకు ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటివి లేవు కాబట్టి నేను అందరితోనూ పంచుకోలేక పోయాను. ఈ వేదికపై అదంతా చెప్పాలనుకున్నాను. కొన్ని సినిమాలు సూపర్ హిట్లవుతాయి, బ్లాక్ బస్టర్లు అవుతాయి. కొన్ని సినిమాలు మాత్రమే.. సినిమాలు తీసే వారి ఆలోచనను కూడా మారుస్తాయి. అలాంటి మార్పు తెచ్చిన సినిమా రంగస్థలం. కొన్ని సినిమాలు తీసిన వారికి గౌరవాన్ని, చూసిన వారికి తృప్తిని తీసుకొస్తాయి. ఆ రెండు జరుగడం చాలా రేర్ కాంబినేషన్. చాలా మందికి డబ్బులు వస్తాయి. బ్లాక్ బస్టర్ ఫిగర్లు వింటూ ఉంటాం. కానీ మనం ఏదో వెలితితో థియేటర్ల నుంచి బయటకు వస్తాం. కానీ చాలా తృప్తితో థియేటర్ నుంచి బయటకు వచ్చే సందర్బాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సినిమా రంగస్థలం. ఈ సంవత్సరం రామ్ చరణ్‌కు ఎంతో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. వచ్చే సంవత్సరం దీనికంటే ఉన్నతంగా ఉండాలి.

 సింహం లాగే రామ్ చరణ్ కూడా...

సింహం లాగే రామ్ చరణ్ కూడా...

రామ్ చరణ్‌ను చూస్తే ఒకే విషయం గుర్తుకు వస్తుంది. సింహం పది రోజులకు లేదా పన్నెండు రోజులకు కానీ వేటాడదు. మిగతా జంతువుల్లాగా ఉదయం లేచి ఏ జంతువు కనిపిస్తుందా? మీద పడి తినేద్దామా అని బయల్దేరదు. ఎప్పుడో బాగా ఆకలి వేసినప్పుడే వేటకు వెళుతుంది. వెళితే వేట సాలిడ్ గా ఉంటుంది. అది తిని వదిలేస్తే నక్కలు, హైనాలు నెల రోజులు పండగ చేసుకుంటాయి. చరణ్ కూడా అంతే. ఓటమి కొడుకు చేతిలో కంటే ఆనందం ఎక్కడుంది? ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని త్రివిక్రమ్ ముగించారు.

వినయ విదేయ రామ

వినయ విదేయ రామ

రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌రాజేష్ ప్ర‌ధాన తారాగ‌ణంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి మాట‌లు: య‌ం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీ: రిషి పంజాబి, ఆర్థ‌ర్ ఎ.విల్స‌న్‌, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వి.వై.ప్ర‌వీణ్‌కుమార్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డి.క‌ల్యాణ్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X