నితిన్-త్రివిక్రమ్ ‘అ..ఆ..’ పోస్టర్ లుక్ సూపర్ (ఫోటో)
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అ...ఆ' (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల రామానాయుడు స్టూడియోలో జరిగింది.
ఈ చిత్రంలో సమంత, అనుపమ పరమేశ్వరన్ (మళయాల చిత్రం ‘ప్రేమమ్' ఫేం) ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5 నుండి మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా అఫీషియల్ గా విడుదల కాకపోయినప్పటికీ.... కొందరు ఔత్సాహికులు ఫస్ట్ లుక్ డిజైన్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలా తయారైన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇదే ఫైనల్ చేస్తే బావుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరైన దర్శకుడు త్రివిక్రమ్ దాదాపు టాప్ పొజిషన్లో ఉన్న హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు మొదటి నుండీ. దర్శకుడిగా తన తొలి సినిమా తరుణ్ హీరోగా ‘నువ్వే నువ్వే' తప్ప మిగతా వన్నీ ఆయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో చేసినవే. ఈ ముగ్గురు హీరోలతో రెండేసి సినిమాలు చేసాడు త్రివిక్రమ్.

చాలా కాలం తరువాత త్రివిక్రమ్ రూటు మార్చారు. నితిన్ లాంటి మధ్య స్థాయి హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. సాధారణంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనగానే పెద్ద స్టార్స్, భారీ తారాగణం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు.
కానీ నితిన్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కోలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాటోగ్రాపర్లనే తన సినిమాలకు ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సౌతిండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











