twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి విడుదలైన నాల్గవ రోజే మొదలు పెట్టా.. అనుకోకుండా అలా మార్చాం.. త్రివిక్రమ్!

    |

    త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లోనే భారీ నిరాశని మిగిల్చిన చిత్రం అజ్ఞాతవాసి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ హిట్ కాంబోలో భారీ అంచనాలంతో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పరాజయం చేసిందింది. మరో మారు మారు అజ్ఞాతవాసి చిత్రం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ చిత్రం నుంచి తేరుకుని ఎలా అరవింద సమేత చిత్రాన్ని ప్రారంభించారో వివరించారు. అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించింది. దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ మరోమారు తన సత్తా చూపించారు.

    అజ్ఞాతవాసి విడుదలకు ముందే

    అజ్ఞాతవాసి విడుదలకు ముందే

    అజ్ఞాతవాసి చిత్రం విడుదల కావడానికి ముందే పూజా కార్యక్రమాలతో అరవింద సమేత చిత్రం ప్రారంభమైంది. అప్పటికి ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ స్టోరీ లైన్ మాత్రమే చెప్పి ఒకే చేయించాడు. కథ ఇంకా సిద్ధం కాలేదు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తొలి చిత్రం కావడంతో ప్రారంభం నుంచే అరవింద సమేతపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

    నాలుగు రోజుల తరువాత

    నాలుగు రోజుల తరువాత

    అజ్ఞాతవాసి చిత్రం విడుదలయ్యాక పూర్తి నిరాశలోకి వెళ్ళా. నాలుగవరోజు నిరాశ నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. ఆరోజే అరవింద సమేత కథ ప్రారంభించానని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జనవరి 19 ఎన్టీఆర్ కు కొంత భాగం కథ వివరించానని అన్నారు. అప్పటికి ఇంకా క్లైమాక్స్ గురించి అనుకోలేదు. మొదటి 20 నిమిషాలు ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని త్రివిక్రమ్ అన్నారు.

    మహిళల గురించి

    మహిళల గురించి

    ఈ చిత్రాన్ని మహిళా సాధికారత కోణంలో చూపించాలని ముందుగా అనుకోలేదు. కథ రాస్తున్న సమయంలో ఆ పాయింట్ నచ్చి అనుకోకుండా ఆ అంశాన్ని కూడా చొప్పించాం అని త్రివిక్రమ్ అన్నారు. అది బాగా వర్కవుట్ అయిందని తెలిపారు. ఫ్యాక్షన్ కథ అయినప్పటికీ అరవింద సమేత చిత్రంలో మహిళల ప్రాముఖ్యతని తెలియజేసే అంశాలు చాలా ఉన్నాయి.

    ఘనవిజయం దిశగా

    ఘనవిజయం దిశగా

    అరవింద సమేత ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. అరవింద సమేత గ్రాస్ విలువ 150 కోట్లు దాటడం విశేషం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. సునీల్ చాలా కాలం తరువాత ఈ చిత్రంలో క్యారెక్టర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Trivikram Srinivas about Agnathavasi failure and Aravindha Sametha story. He started Aravindha Sametha story 4th day after releasing Agnathavasi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X