'అత్తారింటికి దారేది' టైటిల్ విని పవన్ ... : త్రివిక్రమ్
హైదరాబాద్ : '' మొదటే అత్తారింటికి దారేది అనే పేరు పెడదామనుకొన్నా అది పవన్‌కి చెప్పలేదు. ఎలా స్వీకరిస్తారో అనే అనుమానం ఉండేది. కానీ ఓసారి మన సినిమా టైటిల్ ఇదీ అని చెప్పగానే 'మన కథ కూడా అదే కదా? పెట్టండి'' అన్నారు. దాంతో ఆ టైటిల్ ఖాయమైంది'' అని చెప్పారు త్రివిక్రమ్.
పవన్ కల్యాణ్ సినిమాకి 'జల్సా', 'గబ్బర్‌సింగ్'లాంటి పేర్లే కాదు.. 'అత్తారింటికి దారేది' కూడా పెట్టొచ్చు అని నిరూపించారు త్రివిక్రమ్ అని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' లాంటి టైటిల్స్ పెట్టచ్చు కదా అని సినిమా ఆఫీసుల్లో వినపడుతోంది. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారని అంతా ఆ రూట్ లోనే వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
ఇక 'అత్తారింటికి దారేది' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 2 న సెన్సార్ జరగనుంది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. ఈచిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధం అవుతోంది. తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేయడంతో ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని పూర్తిగా అయిపోయింది.
చిత్రం హైలెట్స్ ...స్లైడ్ షో లో...

నైజాం రికార్డు
‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 320కి పైగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. పవర్ స్టార్ సినిమా కాబట్టి థియేటర్లు ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తే ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.

ఫుల్ ఖుషీగా పవన్
మూవీ ఔట్ పుట్ వండర్ ఫుల్‌గా రావడంతో పాటు, సినిమాకు సంబంధించి తను చేయాల్సిన డబ్బింగ్ పని పూర్తవడంతో పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఇంటికెళ్లారని చిత్రం యూనిట్ అంటున్నారు. ఖచ్చితంగా ఘన విజయం సాధింస్తుందనే నమ్మకం ఆయన వ్యక్తం చేసారని చెప్పుకుంటున్నారు.

ఎవడు వాయిదా కలిసొచ్చింది
చివరి నిముషంలో రామ్ చరణ్ చిత్రం ఎవడు ఫోస్ట్ ఫోన్ కావటంతో 'అత్తారింటికి దారేది' విడుదల అయ్యే థియోటర్స్ సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఎవడు చిత్రం దిల్ రాజు నిర్మించటంతో ఆయన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కావటంతో ఆ చిత్రానికే మాగ్జిమం థియోటర్స్ వెళ్లిపోతాయని అంతా భావించారు. అయితే ఇప్పుడు అంతా ఓ ఎగ్రిమెంట్ కు వచ్చి ఎవడు ని వాయిదా వేయటంతో...ప్రతీ సిటీలోనూ ఇబ్బడి ముబ్బడిగా ఈ చిత్రం ధియోటర్స్ ని బుక్ చేస్తున్నారు. దాంతో పవన్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అత్యథిక స్క్రీన్స్ వేసే చిత్రంగా అత్తారింటికి దారేది చిత్రం రికార్డ్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

సూపర్ డైలాగ్స్...
"చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా" అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికే ఆయన అభిమానులు ఉర్రూతలూగిస్తోంది. ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయిని.... చెప్తున్నారు.

మొత్తం రికవరీ...
ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో జతకలిసి నిర్మించారు. మరో నిర్మాత భోగవల్లి బాపినీడు ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో ఈ సంస్ధ గతంలో నష్టపోయింది మొత్తం రికవరీ అవుతుందని చెప్పుకుంటున్నారు.

అత్తాపూర్ బాబా...కేక పెట్టిస్తాడు
పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు. స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్క్రిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి.

ట్రేడ్ లో...
సినిమా విడుదలకు ముందే ‘అత్తారింటికి దారేది' చిత్రం బిజినెస్ అదిరి పోయింది. సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ముందస్తుగానే రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడమే ఈ పరిణామాలకు కారణం. ఇప్పుడు నిర్మాత రేపు డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాతో డబ్బు పంట పండించుకుంటున్నారని ఇండస్ట్రీ వ్యాఖ్యానిస్తోంది.

అత్త..నదియా అదుర్స్
పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











