ఎన్టీఆర్ ఆ వ్యామోహంలో పడలేదు.. అందుకే 18 ఏళ్లకే సూపర్‌స్టార్ అయ్యాడు!
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో వచ్చిన అరవింద సమేత కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ జతకట్టిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఓ ప్రత్యేకమైన రిలేషన్ ఉన్న ఎన్టీఆర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌లో ఉండే అంకితభావం, పట్టుదల, మానసిక స్థైర్యం గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు. ఎంతో మానసిక ధృడత్వం ఉన్న ఎన్టీఆర్‌కు ఎలాంటి సలహాలు ఇవ్వనవసరం లేదని త్రివిక్రమ్ వెల్లడించారు. ఎన్టీఆర్ గురించి ఇంకా ఏమన్నారంటే..
Recommended Video


ఎన్టీఆర్ లాంటి వాళ్లకు
ఎన్టీఆర్ లాంటి వాళ్లకు సలహాలు ఇవ్వనవసరం లేదు. ప్రధానంగా ఎన్టీఆర్ 18 ఏళ్ల వయసుకే సూపర్‌స్టార్ అయ్యాడు. ఇప్పటికే ఆయన సింహాద్రి లాంటి సినిమాలు 20కిపైగా చేశారంటే ఆయన మానసిక శక్తి ఎంత బలమైనదో తెలుసుకోవాలి. అలాంటి మానసిక పరిపక్వత విషయంలో ఆయనకు ఆయనే సాటి అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

మానసిక బలంగా చాలా గొప్పదై
ఎన్టీఆర్ సూపర్‌స్టార్ అయ్యేనాటికి ఆయనకు ఉన్న మానసిక బలంగా చాలా గొప్పదై ఉంటుంది. ఆ వయసు ఆడుతూ పాడుతూ ఉండే వయసు. ఆ వయసులో ఏదో ఓ వ్యామోహంలో పడిపోతారు. అలాంటి వయసులో వాటికి దూరంగా ఉండటమంటే మామూలు విషయం కాదు. వాటిని తట్టుకొని ఉండటం చాలా మందికి సాధ్యపడే వయసు కాదు అని చెప్పారు.

ఎన్నో రకాల డిమాండ్
యుక్త వయసులో ఎన్టీఆర్‌కు ఎన్నో రకాల డిమాండ్‌లు ముందున్నాయి. ఆ డిమాండ్‌లన్నింటిని తట్టుకొని, రకరకాల ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డటం మామూలుగా సాధ్యపడదు. అలాంటి వాళ్లకు మనం సలహాలు ఇవ్వగలమా అని త్రివిక్రమ్ ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌తో 10 ఏళ్లకు పైగా రిలేషన్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ మధ్య అనుబంధం 10 ఏళ్లకుపైనే ఉంటుంది. పదేళ్లుగా ఎన్నో కథలపై చర్చించారు. తాజాగా అరవింద సమేత చిత్రాన్ని రూపొందించి అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం తొలి ఆట నుంచే మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకొన్నది.


Click it and Unblock the Notifications











