twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే మా పిల్లలను స్కూల్లో...: త్రివిక్రమ్ శ్రీనివాస్

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగు భాషను తప్పనిసరి చెయ్యడం చాలా ఆనందంగా ఉండాల్సింది పోయి బాధగా వుంది. ఎందుకంటే, అసలు ఈ పరిస్థితిదాకా తెచ్చుకోవడమే బాధాకరం. ఎవరి తల్లిని వాళ్లు మరచిపోతే ఎలా? తెలుగు భాష ఇప్పటికే 90 శాతం పోయింది. మన ముందు తరంలోనే తెలుగు పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు ప్రముఖ దర్శకుడు,రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకటో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేర్చేందుకు అవసరమైన విధి విధానాలను త్వరలోనే రూపొందించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ వెల్లడించారు. ఈ నేఫద్యంలో త్రివిక్రమ్ ఇలా స్పందించారు.

    అలాగే ఈ తరానికి మాండలికాలు తెలియవు, జాతీయాలు తెలియవు, సామెతలు తెలియవు. బోధన ఎప్పుడైతే మాతృభాషలో ఉంటుందో, దాని భావ వ్యక్తీకరణ మెరుగ్గా ఉంటుంది. మాతృభాషలో అవగాహనాలోపం ఉంటే కష్టం. ఆలోచన పెరగాలంటే సాహిత్యం చదవడం, దాని గురించి పిల్లలకు పరిచయం చెయ్యటం, కథలుగా చెప్పడం చెయ్యాలి. పిల్లలతో రెయిమ్స్ పాడిస్తాం కానీ పద్యాలు పాడించడం లేదు అన్నారు.

    పద్యాల పోటీలు, భగవద్గీత శ్లోకాల పోటీలు, అన్నమయ్య కీర్తన పోటీలు, రామాయణంలో చిన్న ఘట్టంలో నటింపజేయడం లాంటివి చేయాలి. షేక్‌స్పియర్ డ్రామాలో ఘట్టం, అల్లూరి సీతారామరాజు నాటకం వేయిస్తాం కానీ, అభిజ్ఞాన శాకుంతలంలోని ఒక ఘట్టమో, మహాభారతంలోని ఒక చిన్న పాత్రనో వేయిస్తే భాష మీద పట్టు పెరుగుతుంది. ఇంగ్లీషు కొంచెం ఆలస్యంగా అయినా వస్తుంది అవసరం కాబట్టి. కానీ తెలుగు ఇప్పుడు రాకపోతే ఎప్పుడూ రాదు. అందుకే మా పిల్లలను స్కూల్లో తెలుగులో మాట్లాడనివ్వమని యాజమాన్యానికి చెప్పాను. వాళ్లూ సరేనన్నారు అని చెప్పారు.

    ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం పూజ కార్యక్రమాలు జరిగాయి. డిసెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రానికి సరదా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ నేఫధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పవన్ అర్బన్ యూత్ ని రిప్రజెంట్ చేస్తూ కనిపిస్తారు.

    English summary
    Ace Director Trivikram Srinivas feels happy for encouraging Telugu Language,by restricting telugu as compulsory language for All Students.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X