»   »  ఇక ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ అన్ని విశేషాలు, యాప్ వచ్చేసింది

ఇక ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ అన్ని విశేషాలు, యాప్ వచ్చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్రివిక్రమ్ అనగానే కొద్దిపాటి వ్యంగ్యం తో కూడిన సునిశితమైన హాస్యం, జీవిత సత్యాలతో కూడిన పంచ్‌ల మెరుపులు, జీవిత తాత్వికత, మార్మికత కలిసిన మాటలు గుర్తు వస్తాయి. అలా ఎవరైనా రాసినా ..అరే త్రివిక్రమ్ లా రాస్తున్నాడే అంటారు. అలా తన పేరుకే ఓ బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఆయన ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానులందరికీ ఓ శుభవార్త. 'మాటల మాంత్రికుడి'గా పేరుగాంచిన ఆయన పేరుతో ఓ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ ప్రారంభంకానున్నాయి. నవంబర్‌ 7న త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అనే వెబ్‌సైట్‌తో సహా ఆండ్రాయిడ్‌ యాప్‌ను ఎ.బి.సి. డిజిటల్‌ మీడియా అందుబాటులోకి తీసుకురానుంది.

Trivikram Srinivas Android App Unveiled

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి రాహుల్ మాట్లాడుతూ... త్రివిక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన అభిమానులకు కానుకగా ఈ యాప్‌ను రూపొందించాం. ఆయన అభిమానులందరూ ఒక్క క్లిక్‌తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. నేటి నుంచి ఈ యాప్‌ను ఎవరైన డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని అన్నారు.

త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే....పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. శనివారం రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలిషాట్‌కి పవన్‌ క్లాప్‌ కొట్టారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. రెండు నెలల తర్వాత ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజాగా ప్రారంభమైన పవన్‌-త్రివిక్రమ్‌ చిత్రానికి 'దేవుడే దిగివస్తే' అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం.

English summary
ABC Digital Media have planned to launch an android app about Trivikram Srinivas on his birthday, November 7. Them akers say that it is meant to keep fans up to date about Trivikram' movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu