Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
కొత్త హీరోతో త్రివిక్రమ్ రూ.170కోట్ల ప్రాజెక్ట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ 'అల..వైకుంఠపురములో..' సక్సెస్ తో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. అలాగే మార్కెట్ స్థాయి కూడా గట్టిగానే పెరిగింది. కమర్షియల్ ఎలిమెంట్స్ ని ప్రెజెంట్ చేస్తూ తన కాన్సెప్ట్ కూడా మిస్సవ్వకుండా కథను తెరపై ఆవిష్కరించే త్రివిక్రమ్ కి బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ గట్టిగానే అందుతున్నాయి. అయితే ఒక నిర్మాతతో మాటల మాంత్రికుడు చేయవలసిన బడా ప్రాజెక్ట్ పెండింగ్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే..
అల.. బాక్సాఫీస్ మ్యానియా..
అల..వైకుంఠపురములో.. బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చాలా కాలం తరువాత త్రివిక్రమ్ కి అందుకున్న బిగ్గెస్ట్ హిట్ ఇదే. వరల్డ్ వైడ్ గా ఆ చిత్రం 200కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో మాటల మాంత్రికుడు ఆడియెన్స్ లో అలా..తన క్రేజ్ ని పెంచుకున్నాడు. దీంతో నెక్స్ట్ సినిమాపై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
త్రివిక్రమ్ తారకమంత్రం..
నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ - చినబాబు సంయుక్తంగా నిర్మించనున్న ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దాదాపు ఆ సినిమా స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేసుకున్న త్రివిక్రమ్ మరికొన్ని ఆఫర్స్ పై కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే వాటిపై అప్పుడే అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని వెయిట్ చేస్తున్నారట. ఏదేమైనా తారక్ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తరువాతే ఎనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నట్లు టాక్.
బిజినెస్ మెన్ తో బిగ్ డీల్..
కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ ఒక బడా బిజినెస్ మెన్ తో ఒక డీల్ పై పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఆ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత పై త్రివిక్రమ్ సానుకూలంగా స్పందించారట. ఆ ప్రాజెక్ట్ కి బడ్జెట్ లిమిట్స్ లేవని సమాచారం. అవసరమైతే 200 కోట్లయినా ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారట. అయితే గతంలో త్రివిక్రమ్ ఇలాంటి డీలింగ్స్ కి చాలా దూరంగా ఉన్నారు. అఖిల్ ఎంట్రీ మూవీకి త్రివిక్రమ్ రిజెక్ట్ చెప్పినట్లు ఒక రూమర్ అప్పట్లో వైరల్ అయ్యింది.
Recommended Video
కొత్త హీరో కోసం కొత్త రెమ్యునరేషన్..
ఇప్పటివరకు త్రివిక్రమ్ చినబాబు ప్రొడక్షన్ హరికా హాసిని బ్యానర్ లొనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. లాభ నష్టాలు షేర్ చేసుకుంటూ ఒక పార్ట్నర్ లాగా కొనసాగుతున్నాడు. ఇకపోతే కొత్త హీరో కోసం మినిమామ్ 170కోట్ల బడ్జెట్ ని లాక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అందులో త్రివిక్రమ్ కి దాదాపు 35కోట్లకు పైగా రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు టాక్. అయితే త్రివిక్రమ్ ముందుగానే ఈ డిలింగ్ లో ఒక కండిషన్ పెట్టారట. ఎన్టీఆర్ సినిమా తరువాత మరొక ప్రాజెక్టు చేసే అవకాశం ఉందని అది సెట్టవ్వకపోతేనే ఈ న్యూ మూవీని తెరకెక్కిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.