క్రేజీగా రూటు మార్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ!
సినీ పరిశ్రమలో వార్తలు వైరల్ అయినంతగా మరే ఇండస్ట్రీలో కావనేది జగమెరిగిన సత్యమే. తాజాగా అల వైకుంఠపురం చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

హిందీలోకి అల వైకుంఠపురంలో
అల వైకుంఠపురం ఇండస్ట్రీగా మారిన క్రమంలో పలు భాషల నుంచి రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలను సంపద్రించారని, అలాగే బాలీవుడ్ నిర్మాతలు కూడా భారీ రేటుకు అడగడంతో అందుకు నిర్మాత అల్లు అరవింద్ తిరస్కరించారని విషయం మీడియాలో వినిపించింది. అయితే ప్రస్తుతం అలా వైకుంఠపురం సినిమాను హిందీలో స్వయంగా అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మించడానికి సిద్ధపడటమే అందుకు కారణమైంది.

ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్
అయితే హిందీలో నిర్మించే అల వైకుంఠపురం సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్‌గా మారబోతున్నాడని, అల్లు అరవింద్, రాధాకృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. అదే క్రమంలో బాలీవుడ్ పరిస్థితులకు అనుగుణంగా సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం.

బాలీవుడ్ నటీనటులు..
అల వైకుంఠపురంలో బాలీవుడ్ నటులు టబు, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ చిత్రంలో నటించిన పూజా హెగ్డే కూడా బాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ రేంజ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఈ చిత్రం వర్కవుట్ అవ్వడం ఖాయమనే నమ్మకంతోనే సినిమాను ముందుకు తీసుకెళ్తున్నట్టు సమాచారం. వీరు ఈ ప్రాజెక్టులో ఉండటం వల్ల బడ్జెట్ పరంగా కొంత సులభమయ్యే అవకాశం ఉంది.
Recommended Video


ఎన్టీఆర్‌తో మరో ప్రాజెక్టుతో
ఇదిలా ఉండగా.. అల వైకుంఠపురం సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అధికారికంగా ప్రకటన వెలువడింది. అరవింద సమేత సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











