స్నేహం కోసం హీరోను మార్చేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌ చిత్రంలో కీలకమార్పు?

By Rajababu

Recommended Video

స్నేహం కోసం హీరోను మార్చేసిన త్రివిక్రమ్..

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకు ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం. పాటించే విలువలు. ఎవరికైనా మాట ఇస్తే దానిని పక్కాగా అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు అనే పేరు త్రివిక్రమ్‌కు ఉంది. మానవ సంబంధాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా సినిమాల్లో కూడా వాటిని బలంగా చూపుతాడు. గతంలో ఇచ్చిన మాట కోసం తాజాగా ఎన్టీఆర్ చిత్రంలో ఓ హీరోనే మార్చారనే ఓ నిరాధారమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే..

 కీలకపాత్ర కోసం నారా రోహిత్

కీలకపాత్ర కోసం నారా రోహిత్

తాజాగా ప్రారంభమైన ఎన్టీఆర్ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం ముందుగా నారా రోహిత్‌ను అనుకొన్నారట. ఎన్టీఆర్, నారా రోహిత్ ఇద్దరూ నందమూరి కుటుంబానికి చెందిన వారే కావడంతో సినిమాకు ఓ క్రేజ్ కూడా వస్తుంది అని ఆశించారు.

 సునీల్ పేరు తెరపైకి

సునీల్ పేరు తెరపైకి

కానీ తీరా షూటింగ్ ప్రారంభమయ్యే సరికి నారా రోహిత్ ఈ చిత్రంలో లేడనే విషయం ఆసక్తిని రేకెత్తించింది. నారా రోహిత్ స్థానంలో ప్రస్తుతం తన మిత్రుడు సునీల్ తెరపైకి రావడం ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ డిసిషన్ వెనుక గతంలో సునీల్‌కు త్రివిక్రమ్ మాటివ్వడమే అనే మాట వినిపిస్తున్నది.

 సునీల్‌కు సక్సెస్ అవసరం

సునీల్‌కు సక్సెస్ అవసరం

కామెడీ నటుడిగా విశేష ప్రజాదరణను కూడగట్టుకొన్న సునీల్ హీరో అవతారం ఎత్తాడు. మొదట్లో విజయాలు పలకరించినా ఆ తర్వాత ముఖం చాటేశాయి. హీరోగా స్థిరపడటానికి సునీల్ సిక్స్ ప్యాక్ లాంటి ప్రయోగాలు చేశాడు. కానీ ఈ మధ్య బొత్తిగా విజయాలు లేవు. దాంతో సునీల్‌లో టెన్షన్ మొదలైంది.

 సునీల్‌ను ఆదుకోవడం కోసం

సునీల్‌ను ఆదుకోవడం కోసం

సునీల్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో త్రివిక్రమ్ తన స్నేహితుడిని ఆదుకోవడానికి రంగంలో దిగినట్టు సమాచారం. ఎన్టీఆర్, నారా రోహిత్‌ ఎలా ఒప్పించాడో ఏమో గానీ సునీల్‌ను ఎన్టీఆర్ సినిమాలోకి లాగేశాడట.

 అనేక ప్రశ్నలకు జవాబు

అనేక ప్రశ్నలకు జవాబు

దర్శకుడిగా త్రివిక్రమ్ దూసుకుపోతున్న నేపథ్యంలో తన స్నేహితుడు సునీల్‌తో సినిమా చేయరా అనే మాట తరచుగా సినీ వర్గాల్లో వినిపించింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త నిజమైతే అలాంటి మాటకు పక్కాగా సమాధానం చెప్పినట్టు అవుతుంది.

 మాట కోసం నితిన్‌కు అవకాశం

మాట కోసం నితిన్‌కు అవకాశం

గతంలో నితిన్‌కు త్రివిక్రమ్ మాట ఇచ్చి నిలబెట్టుకొన్నట్టు ఆ మధ్య ప్రచారం అయ్యాయి. తనతో సినిమా చేస్తానని ఓ సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ ఆ అనే సినిమాను తీసి నితిన్‌కు హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక సునీల్‌ను కూడా సక్సెస్ బాట పట్టేలా త్రివిక్రమ్ ఏ విధంగా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారో వేచి చూడాల్సిందే.

 పవన్ చేతుల మీదుగా

పవన్ చేతుల మీదుగా

పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ముహుర్తం షాట్ అక్టోబర్ 23న హైదరాబాద్‌లో నిరాడంబరంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రంలోని తొలి సన్నివేశానికి పవన్ క్లాప్ కొట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X