రూమర్లకు తెరదించిన త్రివిక్రమ్.. అవాస్తవాలు.. అలాంటిదేమీ లేదని క్లారిటీ..

By Rajababu

Recommended Video

Trivikram Given Clarity About His Film Gossips రూమర్ల పై త్రివిక్రమ్ క్లారిటీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రంపై సూపర్ క్రేజ్ నెలకొన్నది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టగా ప్రారంభమైన ఈ చిత్రంపై అనేక రూమర్లు ఫిలిం సర్కిళ్లలో షికారు చేస్తున్నాయి. అయితే ఇటీవల ఆ చిత్రంపై వస్తున్న అన్ని రకాల గాసిప్స్‌కు త్రివిక్రమ్ తెరదించారు. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.

 నితిన్ సినిమా మాదిరిగానే...

నితిన్ సినిమా మాదిరిగానే...

ఈ మధ్య నితిన్, సమంతతో తీసిన ఆ ఆ చిత్రం కొంత వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత్రి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ స్పందించి ఆ రచయిత్రికి క్రెడిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 నవల ఆధారంగా కాదు

నవల ఆధారంగా కాదు

సరిగ్గా ఆ ఆ చిత్రానికి సంబంధించిన వార్త మాదిరిగానే తాజాగా మరో వార్త తెరమీదకు వచ్చింది. 80 దశకంలో బాగా పాపులర్ అయిన ఓ నవలను భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నాడు అనే వార్త వైరల్‌గా మారింది. దాంతో త్రివిక్రమ్ తన సన్నిహితుల వద్ద స్పందించాల్సి వచ్చిందట.

 ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ

ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ

ఎన్టీఆర్‌తో తీయబోయే చిత్రం ఏ నవలకు ఆధారం కాదు. అందులో వాస్తవం లేదు. తాను రూపొందించబోయే చిత్రం సకుటుంబ సపరివారంగా చూసే సినిమా. తాను రూపొందించిన కుటుంబ కథా చిత్రాల్లో మాదిరిగానే ఉంటుంది అని త్రివిక్రమ్ వివరణ ఇచ్చారట.

 టాలీవుడ్‌కు టబు

టాలీవుడ్‌కు టబు

ప్రముఖ హీరోయిన్ టబు ఎంపిక ఖారారైంది. తాను చెప్పిన కథ బాగా నచ్చడంతో చాలా రోజుల తర్వాత తెలుగులో నటించడానికి టబు ముందుకు వచ్చింది. మహిళా ప్రాధాన్యం ఉన్న కథ కావడంతో ఆమె ఆసక్తి చూపించారనేది తాజా సమాచారం. బాలకృష్ణతో పాండురంగడు చిత్రం తర్వాత మరే చిత్రంలో కనిపించిన దాఖలాలు లేవు.

 వచ్చే ఏడాది సెట్స్ పైకి

వచ్చే ఏడాది సెట్స్ పైకి

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనున్నది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో రూపొందిస్తున్న చిత్ర షూటింగ్‌లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం యూరప్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది.

 పీఎస్‌పీకే25 పాట రిలీజ్

పీఎస్‌పీకే25 పాట రిలీజ్

నవంబర్ 7 తేదీన త్రివిక్రమ్ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పీఎస్‌పీకే25 చిత్రానికి సంబంధించిన పాటను పూర్తిస్థాయిలో రిలీజ్ చేశారు. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ బర్త్ డే రోజు కొంత భాగాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X