అల్లు అర్జున్ వారసుల ఎంట్రీ.. అబ్బో! వాచిపోయిందంటూ త్రివిక్రమ్ ఫన్నీ కామెంట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' అంటూ సంక్రాంతి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. 'నా పేరు సూర్య' తరువాత గ్యాప్ ఇచ్చిన ఆయన.. అల వైకుంఠపురములో సినిమాతో దాన్ని పూడ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మేరకు ''గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది'' అంటూ క్లారిటీ కూడా ఇచ్చిన ఆయన ఈ సినిమాతో తన వారసులను కూడా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశిస్తూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి పోతే..

అట్టహాసంగా ‘అల.. వైకుంఠపురములో’ మ్యూజికల్ కాన్సర్ట్
జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమైన అల్లు అర్జున్.. విడుదలకు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ మేరకు నిన్న (జనవరి 6) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ కాన్సర్ట్‌ను అట్టహాసంగా నిర్వహించారు.

అశేష అభిమాన వర్గం.. బన్నీ భావోద్వేగం
‘అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ కాన్సర్ట్‌లో బన్నీ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. అశేష అభిమాన వర్గం నడుమ ‘అల.. వైకుంఠపురములో' పాటలు హోరెత్తిపోయాయి. ఈ సందర్బంగా వేదికపై మాట్లాడిన బన్నీ.. తన తండ్రి అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

అల్లు అయాన్, అర్హ పాత్రలు.. త్రివిక్రమ్ స్పీచ్
ఇక ‘అల.. వైకుంఠపురములో' సినిమా స్టోరీ ఎలా ఉండబోతోంది? బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండనుంది? అలాగే అల్లు అయాన్, అర్హ పాత్రల నిడివి ఎంత? వారిద్దరూ ఎలాంటి అల్లరి చేయబోతున్నారు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘అల.. వైకుంఠపురములో' మ్యూజికల్ కాన్సర్ట్ వేదికపై ఆ చిన్నారుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని విషయాలు చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్.

మేం పారిస్ నుంచి ఫోన్ చేయగానే..
ఫస్ట్ టైమ్ తన సినిమాలో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ అల్లు అయాన్‌కి, అందరికంటే మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రిల్లియంట్ స్టార్ అర్హకి థ్యాంక్స్ అని చెప్పారు త్రివిక్రమ్. వాళ్లు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మేం పారిస్ నుంచి ఫోన్ చేయగానే మాకు కాల్షీట్లు ఇచ్చారని ఈ సందర్బంగా వెల్లడించారు మాట్లా మాంత్రికుడు.

బోలెడంత ఖర్చు.. నిర్మాతల చూపు
ఇక ఆ ఇద్దరూ కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేశారని ఆయన తెలిపారు. ఆ రెండు గంటల కోసం బోలెడంత ప్రొడక్షన్ కాస్ట్ అయ్యిందని.. అరవింద్ గారు, చినబాబు గారు మా వైపు పెద్ద పెద్ద కళ్లతో చూశారని త్రివిక్రమ్ అన్నారు. అయినప్పటికీ కూడా వాళ్లు స్టార్స్.. స్టార్స్‌లానే ఉన్నారు. వాళ్లు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, వాళ్లకు నటించే అవకాశం కల్పించిన అల్లు అర్జున్ దంపతులకు కృతజ్ఞతలు అని చెప్పారు త్రివిక్రమ్.

అల.. వైకుంఠపురములో మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications











