కృష్ణ, మహేష్, నరేష్‌కు త్రివిక్రమ్ పరామర్శ.. విజయ నిర్మల మృతితో శోక సంద్రంలో..
దివంగత విజయ నిర్మల మృతితో పుట్టెడు దు:ఖంలో మునిగిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరామర్శించారు. శోక సంద్రంలో మునిగిన కృష్ణను ఆయన ఓదార్చారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విజయ నిర్మల గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణ కుటుంబాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ పరామర్శించడం జరిగింది.
విజయ నిర్మల మృతిపై స్పందిస్తూ.. తెలుగు సినీ పరిశ్రమకు విజయ నిర్మల చేసిన సేవల విశేషం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డును సాధించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఏకైక మహిళా దర్శకురాలిగా అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత సాధించారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు. విజయ నిర్మల కుమారుడు వీకే నరేష్‌ను కూడా త్రివిక్రమ్ ఓదార్చారు. అంతేకాకుండా ప్రగాఢ సంతాపం తెలిపారు.

కృష్ణను తన నివాసంలో పరామర్శిస్తున్న సమయంలోనే మహేష్ బాబు అక్కడికి చేరుకొన్నారు. దాంతో మహేష్ బాబును కూడా పరామర్శించారు. కృష్ణ గారిని చూసుకోవాల్సిన బాధ్యతను ఈ సందర్భంగా గుర్తు చేసినట్టు సమాచారం.

విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం ఉదయం చిల్కూరుకు సమీపంలోని వారి ఫాంహౌస్‌లో నిర్వహించారు. ఆమె చివరి యాత్రలో భారీగా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. అశ్రు నయనాలతో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.


Click it and Unblock the Notifications











