కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు, పవర్ స్టార్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషన్ గా స్పందించారు.

By Bojja Kumar

హైదరాబాద్: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం కాట‌మ‌రాయుడు.శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు, పవర్ స్టార్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషన్ గా స్పందించారు. దేవుడు కొన్ని శక్తులు కోట్లలో ఒకకరికే ఇస్తాడు... అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు.

ఆ పరిస్థితిలోనే జనం ఉన్నందుకు బాధగా ఉందని పవన్ అనేవాడు

ఆ పరిస్థితిలోనే జనం ఉన్నందుకు బాధగా ఉందని పవన్ అనేవాడు

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఎవ‌డో ఒక‌డు వ‌స్తాడు..న్యాయం చేస్తాడ‌నుకుని జీవించే వారిని చూస్తే నాకు గ‌ర్వం అనిపించదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు నాతో అంటుంటారు. ఎవరో ఒకరు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితిలోనే జనం ఇంకా ఉన్నందుకు బాధగా అనిపిస్తుంది అని పవన్ చెబుతుంటారని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

అంతకంటే భాగ్యం లేదు

అంతకంటే భాగ్యం లేదు

అలా ఎవరూ ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావడం కోసం ఎప్పటి నుండో కొన్ని వందల, వేల సంవత్సరాల నుండి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్లలో, వాళ్ల వరుసలో ఎక్కడో చివర నిల్చునే స్థాయి నాక్కూడా కల్పిస్తే అంతకంటే గొప్పది మరేదీ లేదని పవన్ కళ్యాణ్ చెబుతుంటారని అని త్రివిక్రమ్ తెలిపారు.

కోట్లలో ఒక్కడు

కోట్లలో ఒక్కడు

చేయి ఎత్త‌గానే జ‌నం ఆగిపోయే శ‌క్తి ఎక్కడో కోట్ల‌లో ఒకడి మాత్ర‌మే దేవుడు ఇస్తాడు. అలాగే ఇటు వైపు వెళ్లమని చేయి చూప‌గానే అక్కడ ఏముందని కూడా ఆలోచించకుడా పరుగెత్తుకెళ్లిపోయేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్ల‌లో ఒక‌రికే దేవుడు ఇస్తాడు. అలాంటి కోట్లలో ఒక్కడు...ఆయ‌నెవ‌ర‌నే విష‌యం నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.... అని త్రివిక్రమ్ తెలిపారు.

గుర్తింపు కోరుకోని మర్రి చెట్టు లాంటోడు పవన్

గుర్తింపు కోరుకోని మర్రి చెట్టు లాంటోడు పవన్

నాకు ఎప్పుడూ ఒక మాట ఇష్టం. ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావ్ అంటే... ఊరి చివర మ‌ర్రి చెట్టులా ఉంటే మంచిది అని... ఎందుకంటే వేస‌విలో వచ్చిన వాడికి అది నీడ ఇస్తుంది. వాన‌కాలంలో తడుస్తూ వచ్చిన వాడికి చినుకులు పడకుండా కాపాడుతుంది... కానీ నున్ను ఎప్పుడూ గుర్తించ‌మ‌ని అడగదు. అలా మౌనంగా ఊరి చివర నిలబడి ఉంటుంది. నాకు తెలిసి పవన్ కళ్యాన్ తన మిత్రులకుగానీ, సన్నిహితులకుగానీ అలా మౌనంగా వెనక ఉండి సాయం చేయడం నా కళ్లారా చూసాను. అలాంటివన్నీ మీతో పంచుకుని అవతలి వాళ్లని చిన్నగా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టే ఆ సంఘటలను మీతో ప్రస్తావించడం లేదు అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

నిలువెత్తు మంచితనం

నిలువెత్తు మంచితనం

ఒక మనిషి పూసంతైనా పుణ్యం చేయక పోతే శివుడు పిలవడని సీతారామశాస్త్రిగారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేక పోతే ఇంత మంది ఎందుకు ప్రేమిస్తారు. బహుషా ఇది నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకే ఇంత మంది అభిమానులు, ఇంత మంది ప్రేమించే వారు ఉన్నారు. మీకెవరూ డబ్బులిస్తే రారు. పిలిస్తే రారు. మీకు రావాలనిపిస్తేనే వస్తారు, మీకు రావాలనిపించేలా బ్రతికేమనిషి కాబట్టి వస్తారు... అని త్రివిక్రమ్ తెలిపారు.

మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని

మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని

నా సినిమా అత్తారింటికి దారేదిలోని పాట‌లోని పదాన్ని ఈ సినిమా టైటిల్‌గా పెట్ట‌డం సంతోషంగా ఉంది. ఆయ‌న అంద‌రి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. సినిమాల ద్వారానే కాకుండా ఇంకా చాలా మార్గాల ద్వారా ఆయన మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను.

ఒకదేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది.

ఒకదేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది.

ఆయన అంతా కలిపి ఇంతే కావచ్చు. కానీ ఒక్కసారి తలెత్తు చూస్తే ఒకదేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది. ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు. కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు...చాలా మంది కలిసి నడిచే ఒక అడుగు. ఆయన చేసే సాయం ఒక చేతి నుండి వచ్చింది కాదు, కొన్ని కోట్ల మంది మీ అందరి చేతి నుండి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆయన ప్రేమ, మీ అందరి అభిమానం. మరింత ముందుకు వెళ్లాలని, అది చాలా రకాలుగా సేవ రూపంలోకి మారాలని మనస్తూర్తిగా కోరుకుంటున్నాను అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X