»   »  పవన్ బాటలో త్రివిక్రమ్ కూడా, మీడియా ముందుకు పైరసీ నిందితులు

పవన్ బాటలో త్రివిక్రమ్ కూడా, మీడియా ముందుకు పైరసీ నిందితులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఉద్యమాలు, హెచ్చరికల కారణంగా విడుదల రెండు నెలలు ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. పుండు మీద కారం చల్లినట్లు ఈ చిత్రం పైరసీకి గురికావడం నిర్మాతల నెత్తిన మరింత భారం పడింది. పైరసీ వల్ల జరిగే నష్టాన్ని అరికట్టేందుకు వీలైనన్ని థియేటర్లు దొరకక పోయినా అనుకున్న సమయం కంటే ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు.

ఈ పరిణామాల కారణంగా నిర్మాతలకు చాలా నష్టమే వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నిర్మాతకు వెనక్కి ఇచ్చారని, సినిమాకు లాభాలు వస్తేనే తిరిగి రెమ్యూనరేషన్ తీసుకుంటానని డిసైడ్ అయ్యాడట. ఇపుడు అదే బాటలో దర్శకుడు త్రివిక్రమ్ కూడా నడుస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోరు.

కాగా....'అత్తారింటికి దారేది' పైరసీ కేసును పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. పైరసీకి మూల కారణంగా అసిస్టెండ్ ఎడిటర్ అరుణ్ కుమార్‌గా గుర్తించారు. అతని ద్వారానే సినిమా బయటకు లీకైందని తేల్చారు. అతన్ని అరెస్టు చేయడంతో పాటు ఈ పైరసీలో పాలుపంచుకున్న పోలీసు కానిస్టేబుళ్లతో పాటు, మొత్తం 35 మందిని పోలీసులు విచారించారు.

అత్తారింటికి దారేది మచిలీపట్నం నుంచి ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ కావడంతో అరుణ్ కుమార్‌ను అక్కడికి తరలించి...అతని ద్వారా డొంకంతా కదిలించారు. బుధవారం సాయంత్రం పోలీసులు పైరసీలో పాలుపంచుకున్న నిందితులందరినీ మీడియా ముందుకు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

English summary
Film Nagar source said that, Power Star Pawan Kalyan and director Trivikram Srinivas have returned a significant portion of their remunerations to producer BVSN Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu