త్రివిక్రమ్ పెళ్లి ఫొటో వైరల్.. ఆమెను దక్కించుకోవడానికి త్రివిక్రమ్ ఏం చేశాడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ కమర్షియల్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. సినిమా సక్సెస్ కావాలి అంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ కథను అందించగలడని మొదటి నుంచి మంచి టాక్ ను అందుకుంటూ వస్తున్నాడు. మధ్యమధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినప్పటికీ త్రివిక్రమ్ పెన్నుపై చాలామంది హీరోలకు బలమైన నమ్మకం ఉంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కు సంబంధించిన ఒక పెళ్లి ఫొటో వైరల్ గా మారింది.

ఆ సినిమాతో రైటర్ గా
త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు అకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. మొదట స్వయంవరం సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ ఆ తరువాత నువ్వే కావాలి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను అమాంతంగా పెంచేసుకున్నాడు. మెల్లగా మూడేళ్ళ వరకు రైటర్ గా బిజీ అయిన అనంతరం నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మొదటి ఛాన్స్ అందుకున్నాడు.

ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ తోనే..
ఇక ఆ తరువాత అతడు జల్సా సినిమాలతో త్రివిక్రమ్ జర్నీ ఎలా సాగిందో అందరికి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా ఏమిటనేది అందరికి తెలిసిందే. అయితే ఆయన ఎప్పుడూ కూడా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎక్కడా చెప్పుకోలేదు. పర్సనల్ ఇంటర్వ్యూలు అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎక్కువగా ప్రయివేట్ లైఫ్ ను ఇష్టపడుతుంటారు.

పెళ్లి ఫొటో వైరల్
ఇక ఎప్పుడైనా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయితే అవి నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఇక చాలా కాలం తరువాత ఆయన పెళ్లికి సంబంధించిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 2002లో త్రివిక్రమ్ సౌజన్యను వివాహం చేసుకున్నాడు. ఆమె మరెవరో కాదు. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు.

నచ్చిన ఆ అమ్మాయి కోసం..
ఇంకా దర్శకుడిగా కూడా కెరీర్ స్టార్ట్ అవ్వని సమయంలో రైటర్ గా ఉన్నప్పుడే సీతారామశాస్త్రి అతని ప్రతిభను పసిగట్టారు. అందులోనూ మంచివాడు కావడంతో వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయగా ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట. త్రివిక్రమ్ పెళ్లి చూపులకు సిద్దమైన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లిని చూసి ఇష్టపడ్డాడట. మొదట మధనపడినప్పటికి ఆ అమ్మాయే నచ్చిందని ఓపెన్ గా చెప్పేయడంతో పెద్దలు కొంత ఆలోచించిన ఆ తరువాత ఒప్పేసుకున్నారట. ఆ విధంగా త్రివిక్రమ్ పెళ్లి కూడా సినిమా తరహాలో ఒక ట్విస్ట్ తో జరగడం విశేషం.


Click it and Unblock the Notifications











