అర్ధరాత్రి 2 గంటలకు మహేష్ వెనక్కి వచ్చారు
చాలామంది సినిమా...ప్యాశన్ గురించి మాట్లాడుతూంటారు. అయితే మహేష్ బాబు దాన్ని లైవ్ గా అనుభవిస్తూంటారు. నాకు అతడు షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన బాగా గుర్తుంది. అర్ధ రాత్రి రెండు గంటలకు మహేష్ షూటింగ్ పూర్తి చేసుకుని సెట్ ని వదిలి వెళ్ళిపోయారు. అయితే అతను వెళ్ళిపోయాక ఓ రీటేక్ తీసుకునే అవసరమైంది. వెంటనే వెనక్కి పిలిచాను. అతను దాదాపు ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా కొద్ది సేపటిలో మా ముందు ఏ విసుగూ అలసట లేకుండా ప్రత్యక్ష్యమయ్యాడు. ఓ చిన్న చిరునవ్వుతో వర్క్ లోకి దిగిపోయాడు. అతనితో పనిచేస్తే ఓ స్టార్ తో పనిచేస్తున్న ప్రెషర్ అస్సలు ఉండదు. ఎందుకంటే అతనెప్పుడూ స్టార్ స్టేటస్ ని సీరియస్ గా తీసుకోడు. అదే అతనిలో ఉన్న నటుడుకి ఉన్న బెస్ట్ క్వాలిటీ.
ఇక వ్యక్తిగా చెప్పాలంటే అతని జీవితంలో వివాహం చాలా అధ్బుతం చేసింది. అంతకుముందు రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా సిగ్గుపడేవాడు. అయితే ఇప్పుడు మెచ్యూరిటీతో చెయ్యగలుగుతున్నాడు. అలాగే అతని కొడుకు పుట్టాక మరింత మెచ్యూరిటీ వచ్చింది. అది ఓ యాక్టర్ గా మరింత ఉపయోగపడింది. అతను కాన్ఫిడెంట్ గా తన ఫస్ట్ టేక్ ని ఓకే చెయ్యగలగుతున్నాడు. అలాగే అతని టెక్నికల్ నాలెడ్జ్ సూపర్బ్. నేను అనుకోవటం మరో ఐదేళ్ళలో అతను బాలీవుడ్ ని శాసిస్తూంటాడు. అతను యాక్టింగ్ స్టామినా..ఓ రిజర్వాయర్ లాంటింది అంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజాగా ఖలేజా చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇలా మహేష్ గురించి మనస్సలో మాటలు ముందుంచారు.


Click it and Unblock the Notifications











