»   » చిరు ఊహించి ఉండరు: పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్

చిరు ఊహించి ఉండరు: పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నాయకుడనేవాడు జనంతో పాటు నడవకూడదు, జనం కంటే నాలుగడుగులు ముందుండాలని' అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. పవన్ కల్యాణ్‌ను చూసిన ప్రతిసారీ అదే అనిపిస్తుందని ఆయన చెప్పారు. ఒక జాతిని శాసిస్తాడని అతని తల్లిదండ్రులు, అతన్ని పైకి తెచ్చిన అన్న కూడా పవన్ కల్యాణ్ గురించి ఊహించి ఉండరని త్రివిక్రమ్ అన్నారు. పవన్ కళ్యాణ్‌కు పెద్దగా మాట్లాడడం రాదన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడేకలో త్రివిక్రమ్ ఈ వ్యాఖ్యలు చేసారు.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ నాకు ఇష్ట స్నేహితుడు....అయితే అభిమానుల కారణంగా ఆయన నాకు ఇబ్బంది పెట్టే స్నేహితుడిగా మారారని వ్యాఖ్యానించారు. నేను ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ ఆయన గురించి అడుగుతారు, ఆయన టీవీ చూడరు కనుక మీరు చూపిస్తున్న అభిమానాన్ని నేను ఆయనకు వివరిస్తూ ఉంటాను అన్నారు.

Trivikram Srinivas praises Pawan Kalyan

మొత్తానికి త్రివిక్రమ్ వ్యాఖ్యలతో అభిమానులు మరింత హ్యాపీ ఫీలయ్యారు. వీజిల్స్, కేకలతో మడావుడి చేసారు. పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా మాత్రమే తమకు కనిపిస్తుండటంతో.....ఇలాంటి ఆడియో వేడుకల్లో ఆయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి, అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్.

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో త్రివిక్రమ్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో రెండు సూపర్ హిట్ సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
Trivikram Srinivas Praises Pawan kalyan At S/o satyamurthy audio function.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu