twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజ్ఞాతవాసి ప్లాప్ గురించి త్రివిక్రమ్.. పవన్, నేను, నిర్మాత కలసి 25 కోట్లు ఇచ్చేశాం, పవన్ తో కోబలి

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి చిత్రం వచ్చింది. భారీ అంచనాలతో ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులని సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు అద్భుత విజయాలు గా నిలవడంతో ఫాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలు అందుకోవడంతో అజ్ఞాతవాసి చిత్ర పూర్తి గా విఫలమైంది. ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి ప్లాప్ గురించి స్పందించారు. అజ్ఞాతవాసి విషయంలో జరిగిన తప్పులని వివరించారు.

     అలా చెబితే అబద్దం చెప్పినట్లే

    అలా చెబితే అబద్దం చెప్పినట్లే

    అజ్ఞాతవాసి పరాజయం నాపై ప్రభావం చూపించలేదు అని చెపితే అబద్దం చెప్పినట్లే అని త్రివిక్రమ్ అన్నారు. బిజినెస్ వార్త లాంటి అంశాన్ని కథగా రాసుకోవడం తాను చేసిన మొదటి తప్పు అని త్రివిక్రమ్ అన్నారు. మరికొన్ని తప్పులు కూడా జరిగిపోయాయి.

    నా స్నేహితుడు

    నా స్నేహితుడు

    అజ్ఞాతవాసి చిత్రం తరువాత తనకు, పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ ఏర్పడిందనే వార్తల్లో వాస్తవం లేదు. జయం, పరాజయం విషయంలో ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు. పవన్ కళ్యాణ్ నా స్నేహితుడు. ఆయన బావుండాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తిని అని త్రివిక్రమ్ అన్నారు.

     25 కోట్లు తిరిగి ఇచ్చేశాం

    25 కోట్లు తిరిగి ఇచ్చేశాం

    ఎదుటివాళ్ళ కడుపు కొట్టి సంపాదించడం ఎందుకు అనే మనస్తత్వం ఆయనది. అజ్ఞాతవాసి చిత్రాన్ని బయ్యర్లు 90 కోట్లకు కొన్నారు. 60 కోట్ల వరకు తిరిగి వచ్చాయి. మరో 30 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అర్థం అయింది. నేను, పవన్ కళ్యాణ్, నిర్మాత కలసి 25 కోట్ల వరకు వెనక్కు ఇచ్చేశాం అని త్రివిక్రమ్ అన్నారు.

    రాయలసీమ గురించి అధ్యయనం

    రాయలసీమ గురించి అధ్యయనం

    పవన్ కళ్యాణ్ తో చేద్దామనుకున్న కోబలి గురించి త్రివిక్రమ్ మనసు విప్పి మాట్లాడారు. రాయలసీమలో అసలు ఫ్యాక్షనిజం ఎలా ప్రారంభమైంది అనే అంశంతో కోబలి కథ ప్రారంభమైందని అన్నారు. ఆ చిత్రం కోసం రాయలసీమ పరిస్థితులని అధ్యయనం చేసానని అన్నారు.

    కోబలి ఆగిపోయింది అందుకే

    కోబలి ఆగిపోయింది అందుకే

    కోబలి కథ దాదాపుగా పూర్తయిన తరువాత 2014 ఎన్నికలు సమీపించాయి. మరో ఏడాది పాటు సినిమా చేయలేనని పవన్ అన్నారు. అందువల్లనే ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది.

     2019 తరువాత కోబలి

    2019 తరువాత కోబలి

    ప్రస్తుతం సినిమాలు చేసే మూడ్ లో పవన్ కళ్యాణ్ లేరు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. 2019 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ కు సినిమా చేయాలని అనిపిస్తే కోబలి చేస్తానని త్రివిక్రమ్ అన్నారు.

    English summary
    Trivikram Srinivas responds on Agnyathavasi movie. Me and Pawan Kalyan return back 25 cr says Trivikram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X