పవన్ కల్యాణ్‌కు ఆ సినిమా కథ చెబితే.. నిద్రలోకి జారుకొన్నాడట.. త్రివిక్రమ్ చెప్పిన ఆ స్టోరీ ఏమిటంటే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొన్నాయి. అయితే అలవైకుంఠపురం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో పవన్ కల్యాణ్ గురించి త్రివిక్రమ్ చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఆ విషయంలోకి వెళితే. ...

స్టార్ హీరోలకు భారీ హిట్లు

స్టార్ హీరోలకు భారీ హిట్లు

టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు త్రివిక్రమ్ అద్భుతమైన విజయాలు అందించారు. నాగార్జునకు మన్మథుడు, వెంకటేష్‌కు మళ్లీశ్వరి, చిరంజీవికి జై చిరంజీవ, ఎన్టీఆర్‌కు అరవింద సమేత చిత్రాలు అందించారు. ఇంకా ఇతర హీరోలుకు కూడా భారీ సక్సెస్‌ను వారి ఖాతాలో వేశారు.

పవన్ కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్లు

పవన్ కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్లు

పవన్ కల్యాణ్, తివిక్రమ్ కాంబినేషన్‌లో తొలి సినిమా జల్సా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత వచ్చిన అజాతవాసి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది.

అల్లు అర్జున్‌కు హ్యాట్రిక్ సినిమాలు

అల్లు అర్జున్‌కు హ్యాట్రిక్ సినిమాలు

టాలీవుడ్‌లో త్రివిక్రమ్ ఎదురులేని విజయాలు అందించిన హీరో అల్లు అర్జున్. జులాయితో ప్రారంభమైన వారి కాంబినేషన్.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతోపాటు అల వైకుంఠపురంలో చిత్రం వరకు సాగింది. అలా అల్లు అర్జున్‌కు హ్యాట్రిక్ విజయాలు అందించారు.

అల వైకుంఠపురంలో మ్యూజిక్ సక్సెస్ ఈవెంట్‌లో

అల వైకుంఠపురంలో మ్యూజిక్ సక్సెస్ ఈవెంట్‌లో

అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌లో తమన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రితోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కథా, పాటల చర్చ గురించి జరిగింది. ఈ సందర్భంగా కొందరు పాట పడితే నిద్ర పోతాను అని చెప్పాడు. ఎవరైనా తాను నిద్రపోయావని అడిగితే... చిన్నప్పుడు నిద్ర పోవడానికి మా అమ్మ జోలపాట పడేది. అలా ఎవరైనా పాటపడితే నేను నిద్రపోతాను అని చెప్పారు.

Recommended Video

#SSMBRampageOnMAY31st : Mahesh Babu ఫ్యాన్స్ కి పండగే..!! || Filmibeat Telugu
పవన్‌కు అతడు సినిమా కథ చెబితే...

పవన్‌కు అతడు సినిమా కథ చెబితే...


తమన్ మాటలకు నవ్వుల్లో మునిగిపోయిన తివిక్రమ్ శ్రీనివాస్.. తాను పవన్ కల్యాణ్‌తో జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టారు. తాను పవన్ కల్యాణ్‌కు అతడు సినిమా కథ చెప్పాను. అయితే కథ చెప్పుతుండగా పవన్ కల్యాణ్ నిద్రలోకి జారుకొన్నారు అంటూ త్రివిక్రమ్ చెప్పారు. దాంతో కొన్నిసార్లు మన మాటలు ఎదుటివారికి నిద్రపుచ్చినట్టు అవుతుంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X