twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్‌ సీక్రెట్స్ చెప్పేసిన త్రివిక్రమ్.. అదే ఆశిస్తున్నా అంటూ కామెంట్స్

    |

    'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత సినీ రంగానికి కొంత విరామం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయ్యారు. జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అభిమానులు, దర్శకనిర్మాతల కోరిక మేరకు మరోసారి ముఖానికి రంగేసుకొని కెమెరా ముందుకొస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

    ‘పింక్' రీమేక్.. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్

    ‘పింక్' రీమేక్.. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్

    బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తాప్సి నటించిన ‘పింక్' సినిమాకు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయమై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికరంగా స్పందించారు.

    పవన్- త్రివిక్రమ్ దోస్తీ.. జల్సా

    పవన్- త్రివిక్రమ్ దోస్తీ.. జల్సా

    సినీ ఇండస్ట్రీలో పవన్- త్రివిక్రమ్ దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహానికి 'అత్తారింటికి దారేది' సినిమా రెక్కలు కట్టింది. పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం వెనక కూడా త్రివిక్రమ్ ఎంకరేజ్‌మెంట్ ఉందనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. పవన్- త్రివిక్రమ్ మధ్య ఉన్న బాండింగ్ తెలుగు చిత్రసీమలో మరే ఇద్దరి మధ్య లేదని టాక్.

    'అల.. వైకుంఠపురములో' సక్సెస్ మీట్‌.. త్రివిక్రమ్ కామెంట్స్

    'అల.. వైకుంఠపురములో' సక్సెస్ మీట్‌.. త్రివిక్రమ్ కామెంట్స్

    అయితే ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమా సక్సెస్ ఖాతాలో వేసుకొని మంచి జోష్‌లో ఉన్న త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. 'అల.. వైకుంఠపురములో' సక్సెస్ మీట్‌లో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానిచ్చారు త్రివిక్రమ్.

    పవన్ మొదటి ప్రిఫెరెన్స్ అదే

    పవన్ మొదటి ప్రిఫెరెన్స్ అదే

    పవన్ కళ్యాణ్ మీ 'అల వైకుంఠపురములో' సినిమా చూసారా అనే ప్రశ్నకు బదులిచ్చిన త్రివిక్రమ్.. ''సాధారణంగా పవన్ తన సొంత సినిమాలే 100 రోజుల తర్వాత చూస్తారు. 'అత్తారింటికి దారేది' కూడా నేను బలవంతం పెడితే 120 రోజులకు చూశారు. పైగా ఇప్పుడు ఆయన సినిమాల్లోకి కూడా వచ్చారు. సినిమాల్లో నటిస్తున్నా ఆయనకు మొదటి ప్రిఫెరెన్స్ రాజకీయాలే. కాకపోతే ఈ 'అల వైకుంఠపురములో' సినిమా నెల రోజుల లోపే చూస్తారని ఆశిస్తున్నా'' అన్నారు.

    Recommended Video

    Bandla Ganesh Sketch To Enter Into Janasena Party
    'అల.. వైకుంఠపురములో' రికార్డ్స్

    'అల.. వైకుంఠపురములో' రికార్డ్స్

    సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'అల వైకుంఠపురములో' సినిమా పలు రికార్డ్స్ రాస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో భారీ హిట్ సినిమాగా నిలిచిన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సుశాంత్, టబు, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Power star Pawan Kalyan re entry confirmed with Pink Remake. Now director Trivikram Srinivas commented on Pawan Kalyan real life and his intrests.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X