మొదటిసారి శిష్యుడిని లాగుతున్న త్రివిక్రమ్.. అసలు కారణమిదే..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు ప్రతి వర్క్ విషయంలో సొంత నిర్ణయాలే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు. సొంతంగా కథలు రాసుకొని మాటలు కూడా ఆయనే రాసుకుంటారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ ఎప్పుడు కూడా వేరే రైటర్స్ ను గాని తన స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ చేయనివ్వలేదు.
సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి
ఇక అతని దగ్గర వర్క్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమైనా లోపాలు చెబుతూ ఉంటే మాత్రం సరి చేసుకుంటూ ఉంటారట. కానీ త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడి నుంచి ఎక్కువగా చెప్పుకోదగ్గ స్టూడెంట్స్ రాలేదు. కేవలం వెంకీ కుడుముల మాత్రమే ఇప్పుడు సక్సెస్ లో కొనసాగుతున్నాడు. వెంకీ డైరెక్ట్ చేసిన ఛలో , భీష్మ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే అతని పనితనాన్ని మెచ్చుకొని మహేష్ సినిమా కోసం వాడుకోబోతున్నట్లు సమాచారం. సినీ మేకింగ్ విషయాలతో పాటు పూర్తి స్క్రిప్ట్ ప్లానింగ్ ను వెంకీతో రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ లో వెంకీ మళ్ళీ కో డైరెక్టర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ లాంటి అనుభవం ఉన్న దర్శకుడు అతన్ని అంతగా నమ్ముతున్నారు అంటే తప్పకుండా మనోడిలో మ్యాటర్ గట్టిగానే ఉందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అదేంటో తెలియాలి అంటే సినిమా పూర్తయ్యే వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











