వాళ్లకు ఏం కావాలో త్రివిక్రమ్‌కు తెలుసు.. మాటల మాంత్రికుడి సూపర్ ప్లాన్

By Manoj

త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటల రచయితగా పరిచయమైన ఈయన ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు. తూటాల్లాంటి మాటలు రాయడంలో నేర్పరి అయిన ఈయన.. రచయితగా ఓ ట్రెండ్ సృష్టించాడు. ఈ క్రమంలోనే ఎన్నో పంచ్ డైలాగులను ప్రయోగించాడు. డైరెక్టర్‌గా మారిన తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు డిమాండ్ ఉంది. అంతగా హీరోలందరూ త్రివిక్రమ్‌పై నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా బన్నీ కోసం ఓ సూపర్ ప్లాన్ వేశాడాయన. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ వేసిన ప్లాన్ ఏంటి..? వివరాల్లోకి వెళితే..

 వైకుంఠపురములో ఫ్యామిలీ డ్రామా

వైకుంఠపురములో ఫ్యామిలీ డ్రామా

రెండు సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో' విషయంలో యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అదిరిపోయే ఫ్యామిలీ డ్రామాను రాశాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన డైలాగులు ప్రధానాకర్షణ కానున్నాయని టాక్.

 అక్కడ కూడా రిలీజ్

అక్కడ కూడా రిలీజ్

ఎంతో ప్రతిష్టాత్మక వస్తున్న ఈ సినిమాను కేరళలో కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందని గతంలో వార్తలు బయటకు వచ్చాయి. అయితే, ఇది తెలుగులో మాత్రం కాదు. మలయాళంలోకి ఈ సినిమాను డబ్బింగ్ చేస్తున్నారు. అక్కడ బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

 బన్నీ అక్కడ లోకల్ హీరో

బన్నీ అక్కడ లోకల్ హీరో

అల్లు అర్జున్ కేరళలో లోకల్ హీరో అయిపోయాడు. ఆయన ప్రతి సినిమా ఆ రాష్ట్రంలో కూడా విడుదలవుతోంది. అంతేకాదు, తెలుగు తర్వాత మలయాళంలోనే బన్నీకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. అందుకే అక్కడ వరదలు వచ్చిన సమయంలో రూ. 25 లక్షలు విరాళం ప్రకటించాడు. అంతేకాదు, కేరళలోని అలప్పుజలో 66వ నెహ్రూ ట్రోపీ బోట్ రేస్ ఫెస్టివల్‌కు అతిథిగా ప్రభుత్వం నుంచి ఆహ్వనం కూడా అందుకున్నాడు బన్నీ.

 టైటిల్ కూడా ఫిక్స్

టైటిల్ కూడా ఫిక్స్

ఇదే సినిమాను మలయాళంలో విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడి భాషకు అనుగుణంగా టైటిల్ కూడా మార్చారని ఫిలింనగర్ సర్కిళ్లలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అప్పుడు దీనికి ‘అంగు.. వైకుంతపురతు' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ మలయాళం టైటిల్‌తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ‘అల.. వైకుంఠపురములో' అనే ఉండడంతో ఆ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది.

 త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్

చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌లో బన్నీ వైల్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తెలుగులో సాఫ్ట్ లుక్స్ విడుదల చేసిన త్రివిక్రమ్.. మలయాళ పోస్టర్‌లో మాత్రం దీనికి పూర్తి ఆపోజిట్‌గా పెట్టడం వెనుక బలమైన కారణం ఉందని తెలిసింది. అక్కడి ప్రేక్షకులు మాస్ సినిమాలను ఆదరిస్తారు. అందులోనూ బన్నీ నుంచి అలాంటివే కోరుకుంటారు. అందుకే త్రివిక్రమ్ ఇలాంటి పోస్టర్ వదిలాడట.

 ‘అల.. వైకుంఠపురములో’ విషయానికొస్తే..

‘అల.. వైకుంఠపురములో’ విషయానికొస్తే..

‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X