Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్‌జున్‌వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
చిన్న సినిమాకు అండగా త్రివిక్రమ్.. మిస్ మ్యాచ్‌కు మాటల మాంత్రికుడి ప్రోత్సాహం
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.
తాజాగా 'మిస్ మ్యాచ్' సినిమాకు త్రివిక్రమ్ తన వంతు ప్రోత్సాహం అందించారు. చిత్రంలోని మొదటిపాట అరెరే అరెరేను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ, ఆసక్తికరంగాను ఉందని అన్నారు. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీం సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్ చెప్పారు. 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉందని అన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ''నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమాకు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు'' అన్నాడు.