twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న సినిమాకు అండగా త్రివిక్రమ్.. మిస్ మ్యాచ్‌కు మాటల మాంత్రికుడి ప్రోత్సాహం

    |

    ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.

    తాజాగా 'మిస్ మ్యాచ్' సినిమాకు త్రివిక్రమ్ తన వంతు ప్రోత్సాహం అందించారు. చిత్రంలోని మొదటిపాట అరెరే అరెరేను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ, ఆసక్తికరంగాను ఉందని అన్నారు. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీం సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న 'మిస్ మ్యాచ్' సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్ చెప్పారు. 'అరెరే అరెరే' మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉందని అన్నారు.

     Trivikram Srinivas Support For Miss Match Movie

    హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ''నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ 'మిస్ మ్యాచ్' చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నా. నా మొదటి సినిమా 'ఆట కదరా శివ' సినిమాకు త్రివిక్రమ్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు'' అన్నాడు.

     Trivikram Srinivas Support For Miss Match Movie

    English summary
    Director Trivikram Srinivas supporting for small movie. Now he was released a song from Miss Match movie which is directed by Nv nirmal kumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X