నా సినిమాకు చేదు అనుభవం.. మాటల్లో చెప్పలేను.. త్రివిక్రమ్
నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన చల్ చిత్రం టీజర్ ఇటీవల రిలీజైంది. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.
Recommended Video

నాగశౌర్య, రష్మిక మందన్న నటించిన చల్ చిత్రం టీజర్ ఇటీవల రిలీజైంది. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్ర యూనిట్‌కు, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న వెంకీ కుడుములకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ..

నేను ఎక్కువ విసిగించను
నేను సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మాట్లాడాల్సిందంతా సినిమాల్లోనే మాట్లాడేస్తుంటాను. అందుకే ఎక్కువగా సినిమా వేదికలపై విసిగించను.

అలా అనడం పెద్ద మాట
చలో సినిమా దర్శకుడు వెంకట్ నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఇష్టమైన వ్యక్తి కూడా. గురుశిష్యులు అనేది పెద్ద మాట. అలా అంటే పెద్ద మాట అవుతుంది. ఇవాల్టి రోజుల్లో గురువులు అనేవారు లేరు. నేర్పించేవాళ్లు కూడా లేరు.

ఆయన ప్రయాణంలో నేను కూడా
చలో దర్శకుడు వెంకట్‌కు సినిమా అంటే ఇష్టం. చాలా ప్రయాణం చేసిన తర్వాత నా వద్దకు వచ్చాడు. ఆయన ప్రయాణంలో నేను ఓ మజిలీ. నా వద్ద చేరిన తర్వాత వెంటనే సొంతంగా సినిమా చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది.

సాయి కొర్రపాటికి కూడా నాలానే
నా మాదిరిగానే నిర్మాత కొర్రపాటి సాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే సినిమాలు తీస్తూనే ఉంటాడు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా తెలియదు. రాజమౌళి నుంచి అవసరాల శ్రీనివాస్‌తో సినిమాలు తీశాడు.

తొలి సినిమా రిలీజ్ కష్టాలు
తొలి సినిమా తీసి విడుదల చేయడం చాలా కష్టం. అలాంటి కష్టం నాకు తెలుసు. తొలి సినిమా విడుదల చేయడంలో ఎదురైన ఇబ్బందులు తెలుసు. నా మొదటి సినిమా స్వయంవరం చిత్రానికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

నా స్వయంవరం గురించి
స్వయంవరం సినిమాను నిర్మించి విడుదల చేయడానికి నిర్మాతలు చాలా కష్టపడ్డారు. సినిమా హాళ్లలో ఎన్ని రోజులు నడిచిందో.. ప్రివ్యూ థియేటర్లలో కూడా అన్ని రోజులు నడిచింది. వచ్చిన ప్రతీ డిస్టిబ్యూటర్‌కు చాలా రోజులు ఆ సినిమా చూపించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











