త్రివిక్రం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
స్టార్ రైటర్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకుడిగా మారి అతడు వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆయన తొందరపడకుండా మంచి సమయం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఆయన దక్కినట్టు తాజా సమాచారం. పవన్ అన్నవరం పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. పవన్ తాజా సినిమా బంగారం ఆయన అభిమానులను నిరుత్సాహపరిచినా మొదటి రెండు వారాల కలెక్షన్లు బాగున్నాయి. అన్నవరంతో పవన్ జైత్రయాత్ర మొదలై త్రివిక్రం సినిమాతో శిఖరాగ్రానికి చేరుకుంటుందని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications