దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా వనవాసం ట్రైలర్
భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వంలో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెంబర్ 1పై సంజయ్ కుమార్ బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు ఇటీవల పూర్తి చేసుకొంది. రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమా పోస్టర్, టైటిల్‌ను ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాకు ఈ టైటిల్ బాగా నచింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను అంటూ టీం అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

భరత్ కుమార్ పీ నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు మా సినిమా టైటిల్‌ని మెచ్చుకోవడం చాల ఆనందం గా ఉంది. కొని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత "సంజయ్ కుమార్ . బీ" మాట్లాడుతూ సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు తొందర్లోనే ఈ సినిమా ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత "సంజయ్ కుమార్. బీ" చెప్పారు.
సాంకేతిక నిపుణులు:
నటీనటులు: నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి
సంగీతం: ఎం.ఎం.కుమార్, సినిమాటోగ్రఫీ: ప్రేమ్ జై విన్స్ంట్, ఎడిటర్: ప్రభు, పోస్టర్స్ మరియు ట్రైలర్: నాగ విజయ్ కుమార్.ఎం, పీఆర్వో: వీఆర్ మధు


Click it and Unblock the Notifications











