త్రివిక్రమ్ భార్య నాట్య ప్రదర్శన: సతీసమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్ (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

సతీమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్..ఇందుకోసమేనా ??

ప్రముఖ తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడో సినిమా ఫంక్షన్లలో తప్పితే బయట ఎక్కువగా కనిపించరు. ఇక ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్స్ అత్యంత అరుదుగా మీడియా దృష్టిలో పడుతుంటారు. వారి గురించిన వివరాలు కూడా పెద్దగా ఎవరికీ తెలియవు. ఇటీవల రవీంద్ర భారతిలో త్రివిక్రమ్ భార్య సౌజన్య భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వడం చర్చనీయాంశం అయింది. త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప టాలెంట్ అంటూ పలువురు ఆశ్చర్య పోయారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.

నాట్య ప్రదర్శన అద్భుతం

నాట్య ప్రదర్శన అద్భుతం

ఈ సందర్భంగా సౌజన్య ప్రదర్శించిన పలు నృత్యరూపాలు సభికులను ఆకట్టుకున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన ఇంత కాలమైనా ఆయన సతీమణి నాట్య కళాకారిణి అనే విషయం చాలా మందికి తెలియక పోవడం గమనార్హం.

సతీమమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్

సతీమమేతంగా హాజరైన పవన్ కళ్యాణ్

ఈ నాట్య ప్రదర్శన కార్యక్రమానికి సినీ నటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సౌజన్యను ప్రశంసలతో ముంచెత్తారు.

ప్రముఖుల హాజరు

ప్రముఖుల హాజరు

ఈ వేడుకకు కొణిజేటి రోశయ్య, జమున, రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి ప్రముఖులు హజరయ్యారు.

విద్వాన్ రాజగోపాలాచారికి సన్మానం

విద్వాన్ రాజగోపాలాచారికి సన్మానం


సౌజన్య నాట్య ప్రదర్శన అనంతనం... పవన్ కళ్యాణ్, సిరివెన్నెల కలిసి ప్రముఖ మృదంగం కళాకారుడు విద్వాన్ రాజగోపాలాచారిని సత్కరించారు.

సౌజన్య, త్రివిక్రమ్‌లతో పవర్ స్టార్

సౌజన్య, త్రివిక్రమ్‌లతో పవర్ స్టార్

రవీంద్ర భారతిలో సౌజన్య, త్రివిక్రమ్‌లతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

జమున

జమున

సౌజన్య భరతనాట్య ప్రదర్శనకు హాజరైన ప్రముఖ తెలుగు సీనియర్ నటి జమున.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X