షాకిచ్చిన త్రివిక్రమ్ సతీమణి సౌజన్య.. ఇంత టాలెంట్ దాగుందా!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో రాసె మాటలు ఎంత పదునుగా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఆయన వేదికపై నిల్చుని మాట్లాడినా అంతా చూస్తూ ఉండిపోతారు. ఆయన కలం నుంచి, ప్రసంగం నుంచి వక్బాణాలు జాలువారుతాయి. దర్శకులందరిలో త్రివిక్రమ్ ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఇదే. అదే విధంగా త్రివిక్రమ్ కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇటీవల పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కుమార్తే త్రివిక్రమ్ సతీమణి. త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఓ కార్యక్రమంలో తన అద్భుత నైపుణ్యంతో అందరిని ఆశ్చర్యపరిచింది.

క్లాసికల్ డాన్సర్

క్లాసికల్ డాన్సర్

త్రివిక్రమ్ సతీమణి సౌజన్య ఎప్పుడూ మీడియా ముందు కనిపించరు. అందుకే ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె క్లాసికల్ డాన్సర్. చాలా గొప్పగా క్లాసిక్ డాన్స్ పెర్ఫామ్ చేయగల ప్రతిభ సౌజన్య త్రివిక్రమ్ కు ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో సౌజన్య తన ప్రతిభతో అందరిని అబ్బురపరిచారు. వైజాగ్ లో ఈ ఈవెంట్ జరిగింది.

 శాస్త్రీయ నృత్యవిభావరి

శాస్త్రీయ నృత్యవిభావరి

వైజాగ్ లో సంగమం ఫౌండేషన్ తరుపున శాస్త్రీయ నృత్య విభావరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్, లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సౌజన్య క్లాసికల్ డాన్స్ పెర్ఫామ్ చేసి అందరిని మెప్పించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సౌజన్య 2002లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ ఈవెంట్ మొత్తానికి సౌజన్య డాన్స్ పెర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 కొత్త చిత్రానికి

కొత్త చిత్రానికి

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రానికి కసరత్తులు చేస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాలు వచ్చాయి. వీటిలో అజ్ఞాతవాసి చిత్రం నిరాశపరచగా.. అరవింద సమేత చిత్రం విజయం సాధించింది. అరవింద సమేత చిత్రాన్ని త్రివిక్రమ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించారు.

త్వరలో ప్రారంభం

త్వరలో ప్రారంభం


త్రివిక్రమ్, అల్లు అర్జున కాంబినేషన్ లో వచ్చే మూడవ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి,. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి. అల్లు అర్జున్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X