»   » ఆ హీరోతో త్రివిక్రమ్ సినిమా.. మహేష్, వెంకీ సినిమాలు పక్కన పెట్టి మరీ, ఏంటీ మాయ!

ఆ హీరోతో త్రివిక్రమ్ సినిమా.. మహేష్, వెంకీ సినిమాలు పక్కన పెట్టి మరీ, ఏంటీ మాయ!

Subscribe to Filmibeat Telugu
Trivikram Planning Movie With Nani

టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని మాయ కొనసాగుతోంది. యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రాలుకూడా నాని క్రేజ్ తో సూపర్ హిట్ అయిపోతున్నాయి. ఆడియన్స్ నే కాదు నాని దర్శకులని సైతం మాయ చేయడం మొదలు పెట్టాడు. నాని ఎక్కువగా కొత్త దర్శకుడీలతో, ఓ మోస్తరు క్రేజ్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. కాగా నాని.. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

సూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు

సూపర్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు

టాలీవుడ్ లో నాని తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. గత ఏడు చిత్రాలనుంచి నానికి పరాజయమే లేదు. నాని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు అలవోకగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీనితో నిర్మాతలంతా నానితో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నాని నటించడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఆ నిర్మాత చొరవతో

ఆ నిర్మాత చొరవతో

నాని, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య సన్నాహకాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దానయ్య.. త్రివిక్రమ్, నానితో సంప్రదింపులు జరుపుతున్నారట.

ఆ సినిమాలని పక్కన పెట్టి మరీ

ఆ సినిమాలని పక్కన పెట్టి మరీ

ఈ కాంబినేషన్ ఒకే అయితే త్రివిక్రమ్ ఇప్పటికే కమిటై ఉన్న చిత్రాలకంటే ముందుగా ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ సినిమా తరువాత

ఎన్టీఆర్ సినిమా తరువాత

త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ వెంకటేష్ తో ఓ సినిమా చేయవలసి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా త్రివిక్రమ్ సినిమా చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు.

వెంకీ, మహేష్ కంటే ముందుగా

వెంకీ, మహేష్ కంటే ముందుగా

కానీ నిర్మాత దానయ్య వెంకీ, మహేష్ చిత్రాలకంటే ముందుగా నాని చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన త్రివిక్రమ్ తో చర్చలు జరుపుతున్నారట.

నాని మాయ

నాని మాయ

నాని మాయ ఆడియన్స్ పైనే కాదు, దర్శకులపై కూడా పనిచేస్తోంది. త్రివిక్రమ్, నాని కాంబినేషన్లో సినిమా వస్తే అదిరిపోవడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Trivikram Srinivas will going to direct Nani soon. DVV Danayya will Produce this film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu