సైరా దసరా ట్రీట్.. త్రివిక్రమ్‌తో చిరంజీవి, రామ్ చరణ్ స్కెచ్.. ఇదీ మ్యాటర్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. సందర్భానుసారంగా ఎలా మాట్లాడుతాడో అందరికీ తెలిసిందే. అవి ప్రశ్నలైనా.. డైలాగులైనా ఎంతో లోతుగా ఉంటాయన్నదీ తెలిసిందే. స్టేజ్ ఎక్కితే మాటల ప్రవాహాన్ని వదులుతాడు ఈ మాటల మాంత్రికుడు. కానీ ఈ సారి కుర్చీలో కూర్చొని ప్రశ్నల వర్షాన్ని కురిపించబోతున్నాడు త్రివిక్రమ్. సైరా అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేయనున్నాడు.

రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకుని విజయపతకాన్ని ఎగురు వేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా వీర విహారం చేస్తోంది. ఈ మూవీపై సినీ లోకం ప్రశంసల జల్లును కురిపించింది.

రాఘవేంద్రరావు మొదలుకొని రాజమౌళి వరకు
ఎంతో మంది టాలీవుడ్ ప్రముఖులు సైరా నరసింహా రెడ్డి సినిమాపై స్పందించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరడు రాజమౌళి, శోభు యార్లగడ్డ లాంటి ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికెత్తారు. మరోవైపు సైరా ఇంతటి ఘన విజయాన్ని సాధించిందినందుకు మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగి తేలింది.

అల్లు ఫ్యామిలీ కూడా ఘనంగా
సైరా సాధించిన ఈ భారీ విజయాన్ని అల్లు ఫ్యామిలీ కూడా ఘనంగా సెలబ్రేట్ చేసింది. అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన పార్టీలో మెగా హీరోలతో పాటు త్రివిక్రమ్, సుకుమార్, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్, అఖిల్ లాంటి వారు పాల్గొన్నారు. అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో స్కెచ్
ఈ నేపథ్యంలో దసరా కానుకగా.. చిరంజీవీ, రామ్ చరణ్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు. అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో. ఇంటర్వ్యూకు సంబంధించి బయటకు వచ్చిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటల మాంత్రికుడు నుంచి వచ్చే ప్రశ్నలకు వారిద్దరు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో చూడాలంటే దసరా రోజు వరకూ ఆగాల్సిందే.

సైరా నరసింహా రెడ్డి సినిమా
రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో మెగా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.


Click it and Unblock the Notifications











