పవన్ వెంటే త్రివిక్రమ్, అలీ... నాట్ ఓన్లీ సినిమా, జనసేన జర్నీలోనూ!
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలయాన్ని మంగళవారం హైదరాబాద్ లో ప్రారంభించారు.
Recommended Video

సినిమా జర్నీలో పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులు ఎవరు అంటే... అందరూ ముందుగా చెప్పేది త్రివిక్రమ్, అలీ పేర్లే. వీరు కేవలం పవన్ కళ్యాణ్ సినిమా జర్నీలో మాత్రమే కాదు, పొలిటికల్ జర్నీలోనూ ఆయనకు వెన్ను దన్నుగా ఉండబోతున్నారా? అంటే అవును అనే వాదన వినిపిస్తోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినిమా రంగం నుండి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వారిలో త్రివిక్రమ్, అలీ, నిర్మాత సురేష్ బాబు ఉండటం చర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్‌తో వరుస సినిమాలు చేస్తూ ఆయనకు వ్యక్తిగతంగా కూడా సన్నిహితంగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో పాల్గొడంతో పొలిటికల్ జర్నీలోనూ ఆయన పవర్ స్టార్ వెంట నడుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ నుండి సహకారం
ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా అద్భుతమైన మాటలు రచించడంలో త్రివిక్రమ్ కు మంచి పేరుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీకి సంబంధించి ఆయన రాజకీయ ప్రసంగాల పరంగా తన వంతు సహకారం అందిస్తారని తెలుస్తోంది.

అలీ అంటే ఎంతో ఇష్టం
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందు నుండే అలీతో ఆయనకు పరిచయం ఉంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఒక స్నేహితుడిగా, సన్నిహితుడుగా అలీ తనవంతు సహాయాన్ని పవన్ కళ్యాణ్‌కు అందించే అవకాశం ఉందని అంటన్నారు.

ఇటీవల ఇంటర్వ్యూలో అలీ మాట ఇది
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ.... పవన్ కళ్యాణ్ గారితో నేను ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ నేను ఆయన దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడను. ఆయన కూడా మాట్లాడరు. షూటింగులో ఉన్నంతసేపు సరదాగా ఉంటాం. ఆయన పార్టీ పెట్టినా కూడా మీరందరూ రండి, నాకు హెల్ప్ చేయండి, నేను ఇలా ఉంటాను. ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవరికీ చెప్పలేదు. మంచైనా, చెడైనా నేనే పడతాను. నాకు సపోర్టు చేస్తున్న వారిని ఇతర పార్టీల వారు గుర్తు పెట్టుకుంటారు, తిడతారు, హింసపెడతారు, వార్నింగులు ఇస్తారు. నా గురించి మీరు బాధ పడకూడదు. నేను పిలిచినపుడు వద్దరుగానీ, ఈ ఫైట్ ఓన్లీ సోలో ఫైట్.... అదీ పవన్ కళ్యాణ్ ఆలోచన అని అలీ తెలిపారు.

పిలిస్తే వెళ్లడానికి చాలా మంది సిద్ధంగా
ఒక వేళ పవన్ కళ్యాణ్ పిలిస్తే.... సినిమా రంగం నుండి అలీతో పాటు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నది కాదనలేని నిజం. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఎంత మంది సినీ తారలు జనసేనకు జై కొడతారో, ఆయన దారిలో నడుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











