త్రివిక్రమ్ నెక్ట్స్ హీరో?

By Staff

Venkatesh
త్రివిక్రమ్ తన తర్వాత ప్రాజెక్టుని వెంకటేష్ తో చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం వెంకీ కి ఓ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది. ఇక వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు స్క్రిప్టు లు అందించిన త్రివిక్రమ్ పై వెంకీ కి పూర్తి నమ్మకముంది. అయితే ఇంతకు ముందే వీరి కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభం కావల్సి ఉంది. అయితే బడ్జెట్ సమస్యలతో మెటీరియలైజ్ కాలేదు. ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ 2010 మార్చి లో ప్రారంభమయ్యే టట్లు ప్లన్ చేస్తున్నారని వినికిడి.

పూర్తి స్దాయి రొమాంటిక్ కామిడీగా ఈ సబ్జెక్టుని రాస్తున్నట్లు వెంకీ తన వాళ్ళకు చెప్పి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది. ఇక వరుడు గ్యాప్ లో ఒకసారి స్టోరీకి సంభందించిన ఫైనలైజ్ జరగవచ్చునని అంటున్నారు. చింతకాయిల రవి అనంతరం వెంకటేష్ ఏ చిత్రమూ ఇంకా కమిట్ కాలేదు. శ్రీను వైట్ల కు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ప్రాజెక్టు పై ఎవరూ పెదవి విప్పటం లేదు. ప్రస్తుతం వెంకీ..కమల్ తో కలిసి ఈనాడు చిత్రంలో నటిస్తున్నాడు. సాగరసంగమం భంగిమ కుర్రాడు డైరక్ట్ చేసే ఆ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆపీసర్ పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ వెడ్నస్ డే రీమేక్ అది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X