వెంకటేష్‌తో త్రివిక్రం సినిమా?
ప్రాధమికంగా రచయిత అయిన త్రివిక్రం శ్రీనివాస్ మహేష్‌బాబుతో అతడు సినిమా తీసి విజయవతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అతడు అంత పెద్ద హిట్ అయినా త్రివిక్రంకు మరో పెద్ద బ్రేక్ రాకపోవడం ఆశ్చర్యమే. కొన్ని ప్రతిపాదనలకు త్రివిక్రమే అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి లక్ష్మి వంటి పెద్ద హిట్ ఇచ్చిన వెంకటేష్ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వెంకటేష్ అమెరికాలో కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన తిరిగివచ్చిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. గతంలో దిల్ సినిమాకు సహనిర్మాతగా డబ్బు సమకూర్చి లాభపడిన గిరి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications