»   » త్రివిక్రమ్ ఆమెనే తీసుకోవాలని పట్టు

త్రివిక్రమ్ ఆమెనే తీసుకోవాలని పట్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే త్రివిక్రమ్ మాత్రం ఇలియానానే కావాలని,సమంత వద్దని పట్టుపట్టుకు కూర్చున్నాడని తెలుస్తోంది.ఇలియానా రీసెంట్ గా కలిసి తెలుగులో తన కెరీర్ పరిస్ధితి చెప్పటంతో త్రివిక్రమ్ పాత పరచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెనే కావాలని రికమెండ్ చేస్తున్నాట్ట.అయితే అల్లు అర్జున్ కి మాత్రం ఇలియానా అంటే అస్సలు వద్దని,ఆమె ప్రస్తుతం ఐరన్ లెగ్ గా మారిందని దూరం పెడదామని క్లియర్ గా చెప్తున్నాట్ట.అంతేగాక ఇలియానా ప్లాపుల్లో ఉన్నా రెమ్యునేషన్ ఎక్కువ అడుగుతోందని నిర్మాత కంప్లైంట్.అయినా దర్సకుడు,హీరో మధ్యా సయోధ్య కుదిర్చే పనిలో నిర్మాత దానయ్య నలిగిపోతున్నట్లు చెప్తున్నారు.ఇక ఈ చిత్రానికి తమన్‌ సంగితం అందిస్తున్నారు.మరి జల్సా కాంబినేషన్ రిపీట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది కాలం ఆగాలి.

English summary
Trivikram Srinivas was stubborn that he wants Ileana only. With no other option, she was taken.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu