విమానాలమీద అఙ్ఞాతవాసి బ్రాండింగ్, కబాలి స్థాయిలో...: మొబైల్స్, మెట్రో ట్రైన్లపై కూడా

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసాయి. వీరి కాంబినేషన్లో రానున్న మూడో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాటమరాయుదు లాంటి చిన్న డిసప్పాయింట్‌మెంట్ తర్వాత ఆసక్తికరమైన కాంబోతో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయ్.

షూటింగ్ చివరి దశ

షూటింగ్ చివరి దశ

ఈ సినిమాకి టైటిల్స్ గా చాలా ప్రచారం జరిగినా చివరకు "అజ్ఞాతవాసి" టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారు. బ్రాండింగ్‌లో సరికొత్త స్ట్రాటజీని అవలంబించబోతోంది 'అఙ్ఞాతవాసి' టీమ్.

పవర్‌స్టార్ మొబైల్స్‌

పవర్‌స్టార్ మొబైల్స్‌

ప్రచారంలో భాగంగా పవర్‌స్టార్ మొబైల్స్‌ని విడుదల చేస్తూ సరికొత్తగా ప్రయోగం చేయబోతున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ 'అఙ్ఞాతవాసి' టీమ్ అలెర్ట్ అయింది. ప్రచారంలో తమ సినిమాని కొత్త పుంతలు తొక్కించేందుకు సిద్ధమవుతోంది.

సెల్‌కాన్ మొబైల్

సెల్‌కాన్ మొబైల్

'అఙ్ఞాతవాసి' కోసం సరికొత్తగా మొబైల్ బ్రాండింగ్, ఫ్లైట్ బ్రాండింగ్, మెట్రో ట్రైన్స్ బ్రాండింగ్‌పై దృష్టిపెడుతోంది యూనిట్. పవన్ సినిమా కోసం సెల్‌కాన్ మొబైల్ సంస్థ 'పి.ఎస్.పి.కె.25' పేరుతో సరికొత్త మొబైల్స్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉందట. తొలి విడతగా 50 వేల మొబైల్స్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉంది.

ఫ్లైట్స్ బ్రాండింగ్‌

ఫ్లైట్స్ బ్రాండింగ్‌

ఇటీవలే ఆరంభమైన హైదరాబాద్ మెట్రో ట్రైన్స్‌పై కూడా ఫోకస్ పెట్టిందట 'అఙ్ఞాతవాసి' టీమ్. 14 మెట్రో రైళ్లలో 'అఙ్ఞాతవాసి'ని ప్రమోట్ చేయబోతున్నారట. ఫ్లైట్స్ బ్రాండింగ్‌తో సరికొత్త పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది రజనీకాంత్ 'కబాలి', 'అఙ్ఞాతవాసి'కి కూడా అదే తరహాలో ప్రచారం చేయబోతున్నారట.

రెండు ఫ్లైట్స్‌లో 'అజ్ఞాతవాసి' బ్రాండింగ్

రెండు ఫ్లైట్స్‌లో 'అజ్ఞాతవాసి' బ్రాండింగ్

స్పైస్ జెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ నుంచి విశాఖ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రెండు ఫ్లైట్స్‌లో 'అజ్ఞాతవాసి' బ్రాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే ఈనెలలో 'అమరావతి'లో జరగబోయే 'అఙ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ ను కూడా సరికొత్తగా ప్లాన్ చేశారు. మరి ప్రచారంలో సరికొత్త ఎత్తుగడలతో వస్తున్న 'అఙ్ఞాతవాసి' సంక్రాంతికి ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X