చిన్న పిల్లలకు విషం, డబ్బు కోసం ఏమైనా చేస్తారా.. సమంతపై ఘాటుగా విమర్శలు!

అక్కినేని సమంత వివాహం తర్వాత కూడా నటిగా దూసుకుపోతోంది. సమంతకు గత ఏడాది మహానటి, రంగస్థలం లాంటి ఘనవిజయాలు దక్కాయి. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య జంటగా మజిలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంతపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి. చాలా మంది సినీ తారలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తుంటారు. అందులో తప్పులేదు. కానీ ఓ సెలేబ్రిటిగా భాద్యతగా వ్యవహరించాలని కోరుకుంటారు. తాజాగా సమంత చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు.

కుర్కురే యాడ్

కుర్కురే యాడ్

సమంత కుర్కురే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తోంది. కుర్కురే 20వ వార్షికోత్సవం సందర్భంగా సమంత ఓ ట్వీట్ చేసింది. కుర్కురే యాడ్ ఫోటోని పోస్ట్ చేస్తూ.. కుర్కురే సంస్థతో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కుర్కురే 20 వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికి చిన్న సర్ ప్రైజ్. కుర్కురేని మరింత రుచికరంగా తయారు చేసి విడుదల చేయబోతున్నారు అంటూ సమంత ట్వీట్ చేసింది.

ఎన్నో ఆరోపణలు

ఎన్నో ఆరోపణలు

కుర్కురే లాంటి జంక్ ఫుడ్స్, కోకోకోలా లాంటి పానీయాలపై గతంలో ఎన్ని ఆరోపణలు వినిపించాయి. ఆ సంస్థలు తమ ఉత్పత్తుల్లో చాలా ఆరోగ్యకరమైనవని ఎన్ని సార్లు ప్రకటించుకున్నా జనాల్లో ఆ అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. కుర్కురేని కాల్చితే ప్లాస్టిక్ లాంటి పదార్థం వస్తోందని గతంలో ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. కోకోకోలాలో ఉపయోగించే కెమికల్స్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

చిన్నపిల్లలకు విషం

ఇలాంటి పదార్థాలన్నీ చిన్న పిల్లలకు విషం లాంటివి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ.. ఆ ఉత్పత్తులని తినమని ప్రోత్సహించేలా పోస్ట్ లు పెట్టడం ఏంటని నెటిజన్లు సమంతపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే సమయంలో సినీ తారలు కాస్త బాధ్యతాయుతంగా ఆలోచించాలని అన నెటిజన్లు అంటున్నారు. డబ్బు కోసం ఎలాంటి ప్రకటనలు అయినా చేస్తారా అని మండిపడుతున్నారు.

మజిలీ చిత్రంలో

మజిలీ చిత్రంలో

తనపై వస్తున్న విమర్శలపై సమంత స్పందించాల్సి ఉంది. సమంత ప్రస్తుతం మజిలీ చిత్రంలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, నాగ చైతన్య వివాహం తర్వాత తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X