For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేటీఆర్‌పై నవీన్ పోలిశెట్టి ట్వీట్: జాతి రత్నంపై దారుణమైన ట్రోలింగ్.. వామ్మో అందరూ అలాంటి కామెంట్లే

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని మంచి గుర్తింపును అందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అద్భుతమైన టైమింగ్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో సత్తా చాటిన అతడు.. వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో అతడిని నెటిజన్లు ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ వివరాలు మీకోసం!

  #NaveenPolishetty Surprise Call With Family Who Lost Their Father Due To Covid
  అలా పరిచయం.. హీరోగా ఎంట్రీ

  అలా పరిచయం.. హీరోగా ఎంట్రీ

  నటన మీద ఉన్న ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న సమయంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే సినిమాతో పరిచయం అయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఇందులో మంచి పాత్రలో కనిపించిన అతడు.. ఆ తర్వాత ‘డీ ఫర్ దోపిడీ', ‘1 నేనొక్కడినే' వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. ఈ క్రమంలోనే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

  జాతి రత్నాలుతో భారీ విజయం

  జాతి రత్నాలుతో భారీ విజయం

  హీరోగా మొదటి చిత్రంతోనే భారీ హిట్‌ను అందుకున్న నవీన్ పోలిశెట్టి.. ఆ వెంటనే బాలీవుడ్‌లో ‘చిచ్చోరే' అనే సినిమాలో నటించాడు. అక్కడ కూడా మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘జాతి రత్నాలు' అనే సినిమాలో నటించాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. సూపర్ డూపర్ హిట్ అయింది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది.

  వరుస ప్రాజెక్టులతో నవీన్ సత్తా

  వరుస ప్రాజెక్టులతో నవీన్ సత్తా

  వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంటోన్న నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే కేవీ అనుదీప్ దర్శకత్వంలో ‘జాతి రత్నాలు' మూవీ సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అతడు.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో మరో సినిమాను చేయనున్నాడు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు చేయడానికి చర్చలు జరుపుతున్నాడు.

  కేటీఆర్‌పై నవీన్ పోలిశెట్టి ట్వీట్

  కేటీఆర్‌పై నవీన్ పోలిశెట్టి ట్వీట్

  ఈరోజు తెలంగాణ మంత్రి కల్వకుంట తారకరామారావు అలియాస్ కేటీఆర్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని నవీప్ పోలిశెట్టి ట్విట్టర్‌లో ‘రియల్ తెలంగాణ జాతి రత్నం కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కరోనా సమయంలో మీరు చేసిన సహాయాల గురించి ఎన్నో వార్తలను చదివాను. థ్యాంక్యూ సార్. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి' అంటూ పోస్టు చేశాడు.

   నవీన్‌పై దారుణమైన ట్రోలింగ్‌తో

  నవీన్‌పై దారుణమైన ట్రోలింగ్‌తో

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నవీన్ పోలిశెట్టి.. ఈరోజు కేటీఆర్‌ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి ప్రతికూల స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది అతడిని విమర్శిస్తూ రిప్లైలు ఇస్తున్నారు. అందులో ఎక్కువ మంది అతడిపై దారుణమైన పరిభాషలో నెగెటివ్‌గానే కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ యంగ్ హీరోకు చేదు అనుభవం ఎదురైనట్లు అయింది.

  బూట్లు నాకొద్దు... వచ్చాడండీ

  బూట్లు నాకొద్దు... వచ్చాడండీ

  నవీన్ పోలిశెట్టి చేసిన ట్వీట్‌కు ఓ నెటిజన్ ‘ఒక్కరోజైనా ఆస్పత్రి బిల్లుల గురించి మాట్లాడావా? సాయం అందుకున్న వాళ్ల కంటే చచ్చిపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి బూట్లు నాకొద్దు' అని ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్ ‘తెలంగాణ గురించి పట్టించుకోని వాడు ఇప్పుడు వచ్చాడండి' అంటూ చురకలు అంటించాడు. ఇలా ఎన్నో విమర్శలు చేస్తున్నారు.

  English summary
  Tollywood Young Hero Naveen Polishetty Very Active in Social Media. Now He Posted a Tweet about Minister KTR On the Occasion of Birthday. Then Netizens Trolls Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X