Acharya: మూవీలో ఆ సీన్‌పై దారుణమైన ట్రోలింగ్.. చిరంజీవిని అలా చూపించడంతో!

ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాబోయే కొన్ని సినిమాలపై అందరిలో ప్రత్యేకమైన ఫోకస్ ఏర్పడింది. అలాంటి వాటిలో 'ఆచార్య' ఒకటి. దీనికి కారణం ఇందులో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడమే. ఫలితంగా ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఇలా విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఓ సన్నివేశంపై నెటిజన్లు పెదవి విరుస్తూ తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఇంతకీ ఏంటా సీన్? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరూ చూడండి!

మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కాంబోలో రూపొందిన చిత్రమే ‘ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటించారు.

అంచనాలకు తగ్గట్లుగా ప్రీ బిజినెస్

అంచనాలకు తగ్గట్లుగా ప్రీ బిజినెస్

మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన మూవీ కావడంతో ‘ఆచార్య'పై ఆది నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి వంద కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది.

గ్రాండ్ రిలీజ్... థియేటర్లలో రచ్చ

గ్రాండ్ రిలీజ్... థియేటర్లలో రచ్చ

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘ఆచార్య' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి.

అంతటా విడుదల.. అలాంటి టాక్

అంతటా విడుదల.. అలాంటి టాక్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆచార్య' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అయితే, టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు.

ఆచార్య మూవీలో ఆ సీన్ వైరల్‌గా

ఆచార్య మూవీలో ఆ సీన్ వైరల్‌గా

ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే చాలు.. అందులోని సీన్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘ఆచార్య' మూవీ విడుదల సందర్భంగా మెగా అభిమానులు అందులోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ సినిమాలోని ఓ సీన్ తెగ వైరల్ అయిపోతోంది.

రామ్ చరణ్ తండ్రితో చిరంజీవి

రామ్ చరణ్ తండ్రితో చిరంజీవి


‘ఆచార్య' సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రను చేసిన విషయం తెలిసిందే. ఇందులో తన స్నేహితుడు (హీరో సత్యదేవ్) పోలీసుల కాల్పుల్లో చనిపోయే ముందు చంటిబిడ్డ సిద్ధను ఆచార్య చేతుల్లో పెడతాడు. ఇది ఫ్లాష్‌బ్యాక్ సీన్‌గా చూపించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ, ఇందులో చిరంజీవిని గ్రాఫిక్స్‌తో స్లిమ్ అండ్ వింటేజ్‌ లుక్‌తో చూపించడం హైలైట్ అవుతోంది.

Recommended Video

Acharya Movie Review సినిమా అదిరింది కామ్రేడ్ | Filmibeat Telugu
చిరంజీవిని అలా చూపించడంతో

చిరంజీవిని అలా చూపించడంతో

‘ఆచార్య' సినిమాలో సత్యదేవ్‌తో జరిగే సన్నివేశంలో చిరంజీవిని పాత కాలంలో ఉన్నట్లుగా చూపించడంతో దీనిపై ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ సీన్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ చిరంజీవి లుక్‌పై జోకులు వేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివపైనా విమర్శలు చేస్తున్నారు. ఇలా ఈ సన్నివేశం రిలీజ్‌ రోజు విపరీతంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X