‘జ్వాలా రెడ్డి’ అంటూ దొరికిపోయాడు.. కాపీ అంటూ మణిశర్మపై ట్రోల్స్
ప్రస్తుతం పాటలు, ట్యూన్స్, సాహిత్యం కాపీ అంటూ రకరకాల రచ్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సారంగదరియా అనే పాట ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం మణిశర్మ కొట్టిన ఓ బీట్, ఇచ్చిన ట్యూన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జ్వాలా రెడ్డి అంటూ వదిలిన మాస్ బీట్ సాంగ్‌పై యూట్యూబ్‌లో కామెంట్ల రూపంలో చర్చలు జరుగుతున్నాయి.

సారంగదరియా వివాదం..
సారంగదరియా అనే జానపదం చుట్టూ ప్రస్తుతం వివాదం అంటుకుంది. కోమలి, శిరీష ఈ వివాదంలో కేంద్ర బిందువుగా మారారు. సుద్దాల అశోక్ తేజ పల్లవిని వాడుకుని సారంగదరియా రూపు రేఖలను మార్చేశాడు. ఇక ఈ పాట తనదే అని కోమలి వివాదాన్ని మొదలుపెట్టింది. మొత్తానికి శేఖర్ కమ్ముల ఎంట్రీ ఇచ్చి వివాదానికి ముగింపు పలికేశాడు.
హాట్ నెస్ డోస్ పెంచిన ఐశ్వర్య మీనన్

ఇప్పుడు ఇలా..
అయితే ఇప్పుడు మాత్రం మరో వివాదం తలెత్తేలా ఉంది. సీటిమార్ సినిమా కోసం మణిశర్మ తెలంగాణ పాపులర్ సాంగ్ ట్యూన్స్‌ను వాడేశాడు. సీటీమార్ సినిమా నుంచి నిన్న జ్వాలా రెడ్డి అనే పాటను విడుదల చేశారు. మంచి మాస్ బీట్‌లో సాగుతున్న ఈ పాట ట్యూన్ మాత్రం తెలంగాణ ప్రజలకు సుపరిచితమే.

వాటి నుంచి కాపీ..
గొల్లమల్లమ్మ, కళ్లజోడు కాలేజ్ పాప అనే పాటలు తెలంగాణలో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట ట్యూన్స్‌ను వాడేసి జ్వాలా రెడ్డి అనే పాటను క్రియేట్ చేశాడు మణిశర్మ. దీంతో యూట్యూబ్‌లో నెటిజన్లు మణిశర్మను ఏకిపారేస్తున్నారు.

ట్రోలింగ్‌తో రచ్చ..
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో రచ్చగా మారింది. దీన్ని కూడా కాపీ చేసేశారా? అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కాపీ ట్యూన్ అంటూ ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. ఇక గతంలోనూ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఓ పాట ట్యూన్‌ను కూడా మణిశర్మ వాడేశాడు. ప్రస్తుతం ఈ జ్వాలా రెడ్డి పాటలో తమన్నా అందాలు మాత్రం కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











