For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయనతార: ఆ పని చేసి అడ్డంగా దొరకడంతో దారుణంగా!

  |

  చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. మైమరపించేలా చేసే నటనతో దక్షిణాదిలోని అన్ని భాషల ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న బ్యూటీ లేడీ సూపర్ స్టార్ నయనతార. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలే కాదు.. ప్రాధాన్యత ఉన్న రోల్స్‌ను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

  Recommended Video

  Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu

  అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ మూవీలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలను ఎక్కువగా చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు నయనతార 'నెట్రికన్' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించింది. ఇది విడుదలైన సమయంలోనే నయనతార ఓ పని చేసి అడ్డంగా బుక్కైపోయింది. దీంతో ఆమెను దారుణంగా తిడుతున్నారు సినీ ప్రియులు. ఆ సంగతులు మీకోసం!

  అన్ని ఇండస్ట్రీల్లోనూ నయనతార హవా

  అన్ని ఇండస్ట్రీల్లోనూ నయనతార హవా

  తమిళ సినిమాల ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన నయనతార.. కొంత కాలానికి నేరుగా టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. తద్వారా ఈ రెండు భాషల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో బడా, సీనియర్ హీరోల చిత్రాలకు ఈ బ్యూటీనే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఆమెకు ఉన్న స్టార్‌డమ్‌ కారణంగా దర్శక నిర్మాతలు ఈ హీరోయిన్ డేట్స్ కోసమే క్యూ కడుతున్నారు. ఈ రెండు భాషలతో పాటు కన్నడం, మలయాళంలోనూ నయనతార సత్తా చాటుతోంది. ఫలితంగా దక్షిణాది మొత్తానికి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూ తన హవాను చూపిస్తోందీ లేడీ సూపర్ స్టార్.

  బాత్‌టబ్‌లో అందాలు ఆరబోసిన అనన్య నాగళ్ల: సర్‌ప్రైజ్ అంటూ మొత్తం చూపించిన తెలుగు పిల్ల

  రెండు బ్రేకప్‌లు... విఘ్నేష్‌తో లవ్ ట్రాక్

  రెండు బ్రేకప్‌లు... విఘ్నేష్‌తో లవ్ ట్రాక్

  నయనతార సినిమాల పరంగా ఎంత సక్సెస్ అయిందో.. లవ్ ట్రాకుల విషయంలో మాత్రం ఏకంగా రెండు సార్లు ఫెయిల్ అయింది. గతంతో ఓ స్టార్ హీరోతో పాటు ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ.. వాళ్లిద్దరితో బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లలేకపోయింది. ఇలా రెండు బ్రేకప్‌ల తర్వాత ఇప్పుడు ఆమె విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో లవ్ ట్రాక్ నడుపుతూ సాగుతోంది. వీళ్లిద్దరూ 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా సమయంలో కలిశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ప్రేమికులుగా మారిపోయి రచ్చ రచ్చ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

  ఎంగేజ్‌మెంట్‌తో... పెళ్లి గురించి వార్తలు

  ఎంగేజ్‌మెంట్‌తో... పెళ్లి గురించి వార్తలు

  నయనతార.. విఘ్నేష్ శివన్ చాలా కాలం పాటు సీక్రెట్‌గా వ్యవహారాన్ని నడిపించారు. కానీ, కొన్నేళ్ల క్రితం తమ బంధాన్ని బహిరంగంగానే ప్రకటించారు. అప్పటి నుంచి ఈ జంట ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ దేశ వ్యాప్తంగా విపరీతంగా ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అప్పటి నుంచి నయన్.. విఘ్నేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చినా అవి నిజం కాలేదు.

  ప్రయోగాత్మక చిత్రంతో వచ్చిన నయన్

  ప్రయోగాత్మక చిత్రంతో వచ్చిన నయన్

  కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణ చిత్రాల్లో నటిస్తూ తనలోని నటిని మరింతగా పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది లేడీ సూపర స్టార్ నయనతార. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 'నెట్రికన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'గృహం' ఫేం మిలింద్ రౌ తెరకెక్కించిన ఈ సినిమాను నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించాడు. అజ్మల్, మణికందన్, శరన్ కీలక పాత్రలను పోషించారు. గిరీష్ గోపాలకృష్ణన్ దీనికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా నటించింది. ఇది ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

  Evaru Meelo Koteeswarulu: చిరంజీవి అభిమానులకు తారక్ కానుక.. గెస్ట్ ఎపిసోడ్, షో ఆరంభ తేదీపై ప్రకటన!

  అదరగొట్టేసిన నయన్.. ప్రశంసల వర్షం

  అదరగొట్టేసిన నయన్.. ప్రశంసల వర్షం

  నయనతార సినిమాలు అంటేనే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. విభిన్నమైన కథలతో వినూత్నంగా తెరకెక్కుతాయి. మరీ ముఖ్యంగా ప్రతి చిత్రాన్ని ఆమె తనదైన శైలి నటనతో వన్ ఉమెన్ షో చేసుకుంటుంది. ఇక, ఇప్పుడు 'నెట్రికన్' మూవీలోనూ ఆమె అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేసింది. ఇందులో నయన్ నటవిశ్వరూపమే చూపించింది. మరీ ముఖ్యంగా అంధురాలి పాత్రలో ఆమె జీవించేసింది. దీంతో ఈ లేడీ సూపర్ స్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక, ఈ చిత్రం కూడా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌ను సంపాదించుకుని భారీగా క్లిక్కులు సాధిస్తోంది.

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయన్

  ప్రియుడి కోసం హద్దు దాటిన నయన్

  నయనతార ఎంతటి బిజీ హీరోయినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా దక్షిణాది భాషలు అన్నింట్లోనూ ఆమె వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ కావడంతో దర్శక నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేసి తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు. సుదీర్ఘమైన కెరీర్‌లో నయనతారపై పెద్దగా విమర్శలు వచ్చిన సందర్భాలు లేవు. కానీ, తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. అంతేకాదు, ప్రియుడి కోసం ఓ హద్దు దాటేసి విమర్శలపాలు అవుతోంది. దీంతో ఈ హీరోయిన్ హాట్ టాపిక్ అవుతోంది.

  ఘాటు ఫొటోతో హీటు పెంచేసిన రాయ్ లక్ష్మీ: స్విమ్‌సూట్‌లో అందాలు మొత్తం కనిపించేలా!

  ఆ పని చేసి దొరకడంతో దారుణంగా..!

  ఆ పని చేసి దొరకడంతో దారుణంగా..!

  దాదాపు పదేళ్లుగా హీరోయిన్‌గా వెలుగొందుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె సినిమా ప్రమోషన్లకు హాజరైంది లేదు. అప్పుడెప్పుడో బాలకృష్ణతో కలిసి చేసిన 'శ్రీరామరాజ్యం' మూవీ కోసం ప్రమోషన్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు 'నెట్రికన్' మూవీ కోసం నయనతార ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనికి తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాత కావడం వల్లే ఆమె ప్రమోషన్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా అడ్డంగా దొరికిపోవడంతో మిగిలిన చిత్రాల దర్శక నిర్మాతలు కూడా ఆమెపై కోపంగా ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

  English summary
  South Indian Star Heroine Nayanthara Participated in Netrikann Promotions Recently. Movie Lovers Trolling Brutally on Her With This Reason
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X