రణు మండల్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ ట్రోలింగ్

Recommended Video

Ranu Mondal Gets Trolled For Her Makeover Look ! || Oneindia Telugu

నడిమంత్రపు సిరి వచ్చినట్టు.. రణ మండల్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో ఆమె విఫలమవుతూ వస్తోంది. రైల్వే స్టేషన్‌లో ఎంత సహజంగా పాట పాడి అందర్నీ ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. అప్పుడు తన ఆహార్యంపై ఎవరూ కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఆమెలో గాత్ర ప్రతిభను మాత్రమే చూశారంతా. అయితే పరిస్థితులు మారుతూ రావడంతో రణుపై నెగెటివిటీ ఎక్కువైంది.

 ఒక్క పాటతో లైమ్‌లైట్‌లోకి..

ఒక్క పాటతో లైమ్‌లైట్‌లోకి..

రైల్వే ఫ్లాట్ ఫాంపై పాటలు పాడుకునే రణు మొండల్‌ ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ పాట 'ఏక్ ప్యార్ కా నాగ్మా హై' పాడిన వీడియో వైరల్ కావడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. కన్నుగీటి ప్రియా వారియర్ ఎంతగా ఫేమస్ అయిందో.. ఓ పాట పాడి రణు మండల్ కూడా అంతే ఫేమస్ అయింది. లోకల్‌గా బేబీ అనే సింగర్ కూడా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆమె పాట విని ఏఆర్ రెహమాన్ అంతటి వాడే ముగ్గుదయ్యాడని తెలిపారు.

 సెల్ఫీ అడిగిన వారితో దురుసుగా..

సెల్ఫీ అడిగిన వారితో దురుసుగా..

ఇటీవల ఓ అభిమాని రణు మండల్‌ని కలిసి... ఆమెతో సెల్ఫీ తీసుకుంటానని అడిగితే... తనకు కాస్త దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోమని ఆమె చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసి... ఒకప్పుడు ముంబై రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే రణు మండల్... తన మూలాల్ని మర్చిపోయారా అని నెటిజన్లు నిలదీశారు. స్టార్ డమ్‌ను ఆమె తలకెక్కించుకుంటున్నారని నెటిజన్లు మండిపడినా... రణు మండల్ స్పందించలేదు. ఐతే... ఆ తర్వాత ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది.

ఓవర్ డోస్ మేకప్‌తో విమర్శలు..

ఓవర్ డోస్ మేకప్‌తో విమర్శలు..

సింగింగ్ సెన్సేషన్ రణు మండల్... నెటిజన్ల ఆగ్రహాన్ని చూస్తోంది. ఆమె ఫుల్ మేకప్‌తో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఆమె మేకప్ ఓవర్ డోస్ అవ్వడంతో... అసలామె రణు మండల్ అని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో ఆ ఫోటోతో లెక్కలేనన్ని మీమ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

ఆస్కార్ అవార్డు ఇవ్వాలి..

ఆస్కార్ అవార్డు ఇవ్వాలి..

ఆమెకు అంత మేకప్ ఎందుకు... మేకప్ లేకపోతే ఆమెను ఎవరైనా చిన్నబుచ్చుతున్నారా, ఆ మేకప్ వేసినవారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఒకప్పటి రణు, మేకప్‌తో ఉన్న రణు ఫోటోను షేర్ చేస్తూ.. ప్రతిభ ఉంటే సరిపోతుంది అందం, మేకప్ ముఖ్యం కాదు అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అది మేకప్ ఆర్టిస్ట్ చేసిన తప్పు అంటూ మరికొంత మంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X